నిబంధనలు ఉల్లంఘిస్తున్నా పట్టించుకోరా…?Jagtial
బెల్టు షాపులకు మద్యం సరఫరా ఎక్కడి నుంచి…?
నిర్ణీత సమయాలకు ముందే తెరుచుకుంటున్న దుకాణాలపై చర్యలేవీ….?
జగిత్యాల (Jagtial) జిల్లాలో ఎక్సైజ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహారిస్తున్నారు.అని ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణం మరియు చుట్టూ ప్రక్కన గ్రామాల్లో మద్యం విక్రయాలపై పర్యవేక్షణ చేయాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారా..? అనే ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల నిర్వహణలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా..? లేదా అనే అంశంపై నిరంతర పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే చర్చ సాగుతోంది.
వైన్స్‌ల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిన వేళలు ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో సమయపాలన ఉల్లంఘనలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుమతించిన సమయాలకు ముందే దుకాణాలు తెరవడం, నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే ఫిర్యాదులపై అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది.
బెల్టు షాపులకు మద్యం సరఫరా ఎలా….?Jagtial
మరోవైపు గ్రామాలు, పట్టణాల్లోని కొన్ని ప్రాంతాల్లో బెల్టు షాపులు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన రహదారులకు సమీపంలోనే, జనావాసాల మధ్య మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు ఈ బెల్టు షాపులకు మద్యం ఎక్కడి నుంచి సరఫరా అవుతోంది…? ఏ వైన్స్‌ల నుంచి మద్యం వెళ్తోంది…? సరఫరా చేస్తున్న వారిపై ఎక్సైజ్ అధికారులు నిఘా పెట్టారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రికార్డుల తనిఖీలు జరుగుతున్నాయా….?
ప్రతి మద్యం దుకాణంలో మద్యం నిల్వలు, కొనుగోలు బిల్లులు, అమ్మకాల రికార్డులు, ధరల పట్టికలను అధికారులు పరిశీలించాల్సి ఉంటుంది. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారా? అనుమతించిన పరిమితులకు మించి నిల్వలు ఉంచుతున్నారా.? ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విక్రయాలు సాగుతున్నాయా..? అనే అంశాలపై తనిఖీలు చేపట్టాల్సిన బాధ్యత ఎక్సైజ్ శాఖపై ఉంది.
ప్రజల ఫిర్యాదులకు స్పందన కరువు …?Jagtial
వైన్స్‌ల చుట్టుపక్కల నివసించే ప్రజలు, మహిళలు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తనిఖీలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో జరగాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఉన్నతాధికారులు స్పందించాలి…!
జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులు కోరుట్ల పట్టణ చుట్టు ప్రక్కన ప్రాంతాల్లోని మద్యం దుకాణాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి. గత మూడు నెలల్లో ఎన్ని తనిఖీలు నిర్వహించారు..? ఎన్ని ఉల్లంఘనలు గుర్తించారు..? ఎన్ని కేసులు నమోదు చేశారు…? ఎన్ని దుకాణాలపై చర్యలు తీసుకున్నారు..? బెల్టు షాపులకు మద్యం సరఫరా చేస్తున్న వారిపై ఎలాంటి చర్యలు చేపట్టారు…? అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని పలువురు కోరుతున్నారు.
ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన మద్యం వ్యాపారంలో నిబంధనలు అమలవుతున్నాయా లేదా అన్నది ఉన్నతాధికారులు స్పష్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
