- సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆదం ఆధ్వర్యంలో వేడుకలుIndira Gandhi
- ఇందిర గాంధీ విగ్రహానికి నేతల నివాళి
ఇందిరాగాంధీ (Indira Gandhi) దేశానికి చేసిన సేవలు ఎన్నటికీ మరచి పొలేనివని సికింద్రాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆదం సంతోష్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంస్కరణలు చేసిన మహోన్నతురాలు స్వర్గీయ ఇందిరా గాంధీ అని కొనియాడారు. మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీ 109వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ నియోజకవర్గం అడ్డగుట్ట డివిజన్ తుకారంగేట్ కూడలిలో గల ఇందిరాగాంధీ విగ్రహానికి డివిజన్ నాయకులతో కలసి ఆదం సంతోష్ కుమార్ పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ఉన్నత వర్గాలకే పరిమితమైన బ్యాంకులను జాతీయం చేయడం ద్వారా పేద ప్రజలకు, గ్రామీణ ప్రజలకు సైతం అందు బాటులోకి తెచ్చారని అన్నారు. చారిత్రాత్మక, సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రతిపక్ష నేతలతో కూడా ఉక్కు మహిళగా కొనియాడింపపడ్డారని పేర్కొన్నారు. వారి స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని వెల్లడించారు… ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు గంట రాజు సాగర్, రాజేందర్ యాదవ్, సీనియర్ నాయకులు కొమరమ్మ, జాఫర్ నాగభూషణం, సుదర్శన్, యూసుఫ్, అంజయ్య యాదవ్, భూపతి హరి, మంద సురేష్, జామ్ అనిల్, మార్కెట్ కమిటీ ఆమీర్, చంద్రకళ, నర్సమ్మ, రామ్ లీలా, ఉమా, వరలక్ష్మి, రవీందర్, నవీన్, అనిల్ ఐజాక్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
