Homeఆదిలాబాద్Bribery Allegations | డీఎఫ్ఎను వెంటనే విధుల నుంచి తొలగించాలి

Bribery Allegations | డీఎఫ్ఎను వెంటనే విధుల నుంచి తొలగించాలి

  • లంచాల పేరుతో వేధింపులు.. అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలుBribery Allegations
  • నిబంధనలకు విరుద్ధంగా చాందా దగ్గర రాజేశ్వర దుకాణం కు అనుమతులు
  • ఫోన్ పే ద్వారా రూ.25 వేల ముడుపులు తీసుకున్నారని ఆరోపణ

నిబంధనల ప్రకారం షాపులు ఏర్పాటు చేసుకునే తాత్కాలిక నిర్వాహకులకు అడ్డంకులని ఆవేదన :

పట్టణంలో క్రాకర్స్ విక్రయాల అనుమతుల విషయంలో పైర్ అధికారుల తీరుపై క్రాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు యెల్లి అరుణ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎఫ్ఎను వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు. (Bribery Allegations) లంచాల పేరుతో జిల్లా ఫైర్ అధికారి సురేష్ క్రాకర్స్ షాప్ నిర్వాహకులను వేధిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

- Advertisement -

ఫోన్ పే ద్వారా డీఎఫ్ఓ కు రూ.25 వేల అమౌంట్ ను ఇచ్చినట్టు ఆరోపణలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా చాందా బెల్లూరి దగ్గర రాజేశ్వర దుకాణానికి అనుమతులు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మరోవైపు రాంలీలా మైదానంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తాత్కాలిక క్రాకర్స్ దుకాణాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులకు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని, దీంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణంలో క్రాకర్స్ విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, గాంధీ చౌక్లోని మల్లికార్జున స్టీల్ నిర్వాహకుడు గంగాధర్ షాప్ లో ఏడాది పొడవునా క్రాకర్స్ విక్రయాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నిబంధనలు పాటిస్తూ వ్యాపారం చేసుకునే వారిపై ఆంక్షలు విధించడం, ఇతరులకు అనుమతులు ఇవ్వడంపై అధికారులు స్పష్టత ఇవ్వాలని అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. అక్రమ వసూళ్లపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ మేరకు వారు కోరారు. కార్యక్రమంలో క్రాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, మహేందర్ గౌడ్, గొర్ల సంతోష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube) 

- Advertisement -
RELATED ARTICLES

Latest News