- కాలంతో సంబంధం లేకుండా దొరుకుతుంది..
- అలవాటుగా మార్చుకోండి.. ప్రయోజనం చేకూరుతుంది..
మీ డైట్‌లో స్వీట్ కార్న్(Sweet Corn) ఉంటే ఎన్నో ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. అవేంటో చూద్దాం..
- తియ్యటి మక్కజొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్‌లు పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్, లివర్ క్యాన్సర్‌కు చెక్ పెట్టడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
- ఇక స్వీట్‌కార్న్(Sweet Corn) అంటేనే ఫైబర్‌కు చిరునామాగా చెప్పవచ్చు. వీటిలో ఉండే పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగుపర్చడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. మలబద్ధకం, పైల్స్‌తో బాధపడుతున్న వారికి ఈ స్వీట్‌కార్న్ మంచి పరిష్కారమని చెప్పవచ్చు.
- స్వీట్‌కార్న్‌లలో ఉండే విటమిన్-సి, కెరోటినాయిడ్స్, బయోఫ్లెవనాయిడ్స్ గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి-12, ఐరన్, ఫోలిక్ యాసిడ్‌లు రక్తహీనతకు చెక్ పెడుతాయి.
- అదేవిధంగా తియ్యటి మక్కజొన్నల్లోని ఫాస్ఫరస్, మెగ్నీషియం, మ్యాంగనీస్, ఐరన్, కాపర్, జింక్ వంటి ఖనిజాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుపడేలా చేస్తాయి.
- నిత్యం ఒత్తిళ్లతో పనిచేసే వారికి స్వీట్ కార్న్ మంచి మందులా పనిచేస్తుంది. అందులో ఉండే ఫినోలిక్ ఫైటో కెమికల్స్ హైపర్ టెన్షన్‌ను తగ్గిండచంలో బాగా పనిచేస్తాయి.
- స్వీట్ కార్న్‌లు చాలా వేగంగా జీర్ణమవుతాయి. అందువల్ల శరీరానికి తక్షణమే కావాల్సినంత శక్తి వస్తుంది. అందువల్ల స్వీట్‌కార్న్‌ను ప్రతిరోజూ కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకుంటే ఆరోగ్యం ఆహ్లాదకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
- Advertisement -
