- ప్రజా పోరాటాల్లో ముందంజ.. ప్రజాతీర్పులో ఎందుకు వెనుకంజ?Communist Party
- పోరాటాల చరిత్ర ఘనం.. విజయాల ప్రస్థానం మాత్రం శూన్యం ?
- ఒకప్పుడు రాజకీయ శక్తి.. నేడు ఉనికి కోసం తోడుకై పోరాటం ?
- ఎర్రజెండాకు కాలం చెల్లిందా? లేక వ్యూహాలే బెడిసికొడుతున్నాయా ..?
- క్యాడర్ ఉంది,కదనరంగంలో పట్టు ఏది?ఎక్కడ తప్పు జరుగుతుంది ?
- మారుతున్న కాలం.. మారని వామపక్ష నేతల రాజకీయ తీరులో ఉందా ?
- వామపక్ష పార్టీల అవసరం ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఎప్పటికీ ఉంది..?
- (వాసుకుమార్ స్టేట్ బ్యూరో)
పోరాటాలకు పెట్టింది పేరు.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక.. కార్మిక, కర్షక హక్కుల కోసం అలుపెరగని ఉద్యమాలు..(Communist Party)ఇవన్నీ వామపక్షాల రాజకీయ ప్రస్థానానికి చిరునామాలు. ఒకప్పుడు దేశ రాజకీయాలను ఒక కుదుపు కుదిపేసి తనదైన మార్కును ప్రభావితం చేసిన ఎర్రజెండా పార్టీలు నేడు ఎన్నికల బరిలో నిలబడేందుకు ఎందుకు తోడును వెతుకుంటున్నాయి..? ప్రజా ఉద్యమాల్లో కనిపించే బలం ఓట్ల పెట్టెల్లో ఎందుకు ప్రతిఫలించడం లేదు? సిద్ధాంతాల పట్ల నిబద్ధత ఉన్నా.. ప్రజాభిమానం ఎందుకు కరువవుతోంది? కాలానుగుణంగా మారని రాజకీయ వైఖరా? లేక నాయకత్వ లోపమా? లేక బలహీనపడుతున్న క్షేత్రస్థాయి పునాదులా? కారణాలు ఏవైనా కావొచ్చు .. వామపక్షాల ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరాన్ని స్పష్టం చేస్తోంది.
ఎర్రజెండాకు కాలం చెల్లిందా? లేక వ్యూహాలే బెడిసికొడుతున్నాయా ..?Communist Party
నిజానికి భారత రాజకీయాల్లో వామపక్షాలకు ప్రత్యేకమైన చరిత్ర ఉంది. కార్మికులు, కర్షకులు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న పార్టీలు వామపక్షాలు మాత్రమే . ప్రజా ఉద్యమాల్లో ముందుంటూ, ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నాయి. అయినప్పటికీ ఎన్నికల రాజకీయాల్లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయాలు సాధించలేకపోతున్నాయి. ఇందుకు కారణం సిద్ధాంతాల్లో లోపమా? లేక రాజకీయ వ్యూహాల్లో వైఫల్యమా?అనేది వామపక్షాలు సైతం గుర్తించలేని పరిస్థితి వచ్చింది..? వామపక్షాల ప్రధాన బలం ప్రజా సమస్యలపై పోరాటం.

కానీ ఉద్యమాల్లో లభించే మద్దతును ఓట్లుగా, ఓట్లను అధికారంగా మార్చుకోవడంలో విఫలమవుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ ఆలోచనలను మార్చుకోకపోవడం, యువతను ఆకర్షించే కొత్త నాయకత్వాన్ని తయారు చేయలేకపోవడం వామపక్ష పార్టీలో ప్రధాన సమస్యలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు కూటమి రాజకీయాల్లో స్వతంత్ర గుర్తింపును నిలబెట్టుకోవడంలోనూ వామపక్ష పార్టీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సంప్రదాయ ఓటు బ్యాంకు క్రమంగా తగ్గిపోతుండగా, పట్టణ మధ్యతరగతి, యువత, కొత్త తరం ఓటర్లలో ప్రభావం పెంచుకోలేకపోతున్నాయి. కేవలం సిద్ధాంత ప్రసంగాలు, నిరసనలు, ఆందోళనలతోనే ప్రజల విశ్వాసాన్ని పూర్తిస్థాయిలో పొందడం సాధ్యం కాదనే వాస్తవాన్ని వామపక్ష పార్టీలు ఇకనైనా గుర్తించాల్సిన అవసరం ఉంది.
వామపక్ష పార్టీల అవసరం ప్రజాస్వామ్యంలో ప్రజలకి ఎప్పటికీ ఉంది..?Communist Party
వామపక్షాలకు సిద్ధాంతాల కొరత లేదు.. పోరాటాల చరిత్రకు కొదవలేదు.. త్యాగాలకు,ప్రాణ త్యాగాలకు వెనుకంజ లేదు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా రాజకీయ వ్యూహాలను మార్చుకోవడంలోనే వెనుకబడుతున్నాయన్న చర్చ జరుగుతుంది..? ప్రజల పక్షాన పోరాడటం ఎంత ముఖ్యమో.. ప్రజల విశ్వాసాన్ని సంపాదించి, దానిని ఎన్నికల విజయాలుగా మలచుకోవడం కూడా అంతే ముఖ్యం. కాలం మారుతోంది.. రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి.. ఓటర్ల ఆలోచనా విధానాలు మారుతున్నాయి. ఈ మార్పులను అర్థం చేసుకుని కొత్త నాయకత్వం, నూతన ఆలోచనలు, సమకాలీన వ్యూహాలతో వామపక్షాలు ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. లేదంటే ఒకప్పుడు రాజకీయాలను శాసించిన ఎర్రజెండా..
భవిష్యత్తులో కేవలం ప్రజా ఉద్యమాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.ఒకప్పుడు ప్రజా ఉద్యమాలకు దిక్సూచిగా నిలిచిన ఎర్రజెండా.. నేడు ఎన్నికల రాజకీయాల్లో తన పూర్వవైభవాన్ని కొల్పోయో స్థితికి చేరుకోనుంది..నిజానికి వామపక్షాలు కనుమరుగు కావాల్సిన రాజకీయ శక్తులు కావు.. ప్రజాస్వామ్యానికి అవసరమైన ప్రత్యామ్నాయ గొంతుకలు. ఆ గొంతుక మరింత బలంగా వినిపించాలంటే సిద్ధాంతాలతో పాటు సమకాలీన ఆలోచనలు, పోరాటాలతో పాటు ప్రజల విశ్వాసం, ఉద్యమాలతో పాటు రాజకీయ దూరదృష్టి అవసరం. ఎర్రజెండా మళ్లీ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకోవడమే కాదు.ప్రజాస్వామ్య రాజకీయాల్లో తన క్రియాశీల పాత్రను పునరుద్ధరించుకోవాలి..
మారుతున్న రాజకీయ సమీకరణాల్లో మళ్లీ ప్రజల విశ్వాసాన్ని చూరగొని, పోరాటాల స్ఫూర్తిని రాజకీయ విజయాలుగా మలుచుకోవాలన్నదే ఈ మా ఆలోచన ?(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
