Homeమెదక్‌Paddy Procurement Centers | ఆరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Paddy Procurement Centers | ఆరు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

  • రైతులు ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలి
  • ప్రైవేటు వ్యాపారుల అధిక ధరల ఆశలకు మోసపోవద్దు
  • ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి

రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర అందించడంతో పాటు,విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలను(Paddy Procurement Centers) ఏర్పాటు చేసినట్లు నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి తెలిపారు.రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని ఆమె సూచించారు.శనివారం చిలిపిచేడ్ మండల పరిధిలోని సోమక్కపేట,చిలిపిచేడ్,చిట్కూల్, రాందాస్‌పల్లి,శీలంపల్లి,చండూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు.

వీటిలో మూడు కేంద్రాలను సొసైటీ ఆధ్వర్యంలో,మరో మూడు కేంద్రాలను ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461,సాధారణ రకం ధాన్యానికి రూ.2,441 మద్దతు ధర ప్రకటించిందని తెలిపారు.అంతేకాకుండా ఏడు రకాల సన్న ధాన్యానికి క్వింటాలుకు అదనంగా రూ.500 బోనస్ అందిస్తున్నట్లు వివరించారు.ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలు చెల్లిస్తామంటూ ఆశ చూపి రైతులను మోసం చేసే అవకాశం ఉందని,అలాంటి వారి మాటలు నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే(Paddy Procurement Centers) ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.

- Advertisement -

రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలని,తూకం,రవాణా తదితర అంశాల్లో అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసి రైతులకు అందుబాటులో ఉండాలని సంబంధిత సిబ్బందికి తెలిపారు.ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి,డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ దత్తాత్రి,నర్సింలు,తహసీల్దార్ శివప్రసాద్,ఎంపీడీవో ప్రవీణ్,ఏపీఎం గౌరీశంకర్, బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు బెస్త లక్ష్మణ్, నాయకులు ఎంసీ విట్టల్, యాదగిరి, విట్టల్, శ్రీకాంత్‌రెడ్డి, బిక్షపతి, సర్పంచులు, కార్యదర్శులు మోహన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News