- ధర్మసాగర్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు తొలగించాలి: కలెక్టర్ భవేశ్ మిశ్రా
నిర్మల్: జిల్లాలో నీటిపారుదల శాఖకు చెందిన భూములు అన్యాక్రాంతం కాకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(Collector Bhavesh Mishra) ఆదేశించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

మంగళవారం పట్టణంలోని ధర్మసాగర్ చెరువు ఎఫ్‌టీఎల్ (పూర్తి నీటిమట్టం) పరిధిలో ఆక్రమణలను కలెక్టర్(Nirmal Collector) పరిశీలించారు. చెరువుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకుని, మ్యాపులను పరిశీలించారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో అక్రమంగా వెంచర్ ఏర్పాటు చేసేందుకు చేపట్టిన నిర్మాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశించారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేయాలని సూచించారు.
ధర్మసాగర్ చెరువు వద్ద అనధికారికంగా నిర్మించిన లేఅవుట్ ఫెన్సింగ్ గోడను అధికారులు కూల్చివేశారు. వెంచర్ నిర్మాణ పనులకు వినియోగిస్తున్న యంత్రాలు, సామగ్రి, ఇసుక తదితర వస్తువులను స్వాధీనం చేసుకుని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలోని నీటిపారుదల శాఖ భూములు, చెరువుల పరిధిలో ఆక్రమణలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.(Nirmal Collector) ఆక్రమణలను గుర్తించడంలో నిర్లక్ష్యం వహించరాదని, ప్రభుత్వ భూముల పరిరక్షణకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఈ పరిశీలనలో నీటిపారుదల శాఖ ఈఈ అనిల్, మున్సిపల్ కమిషనర్ రవిబాబు, తహశీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
