- తెలంగాణ ఉద్యమకారుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
- అరచేతితో సూర్యకాంతిని ఆపలేరు
- ఉద్యమకారుల హామీలు నెరవేర్చేంతవరకు పోరాటాలు ఆపేది లేదు
- పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్లు తప్ప
ఈరోజు జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి బయలుదేరుతున్న ఉద్యమకారులను అరెస్టు(Arrest) చేసిన 1టౌన్ పోలీసులు చేయడం.ఈ సందర్భంగా ఉద్యమకారులు మాట్లాడుతూ సీఎం ఇంటిని ముట్టడికి వెళుతున్న ఉద్యమకారులను నిర్బంధించడము చాలా సిగ్గుచేటు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసులు సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధన కోసం కష్టపడి పని చేసిన తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను ఇబ్బంది పాలు చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యమకారులకు కల్లిబొల్లి మాటలు చెప్పి ఉద్యమకారుల హామీలు నెరవేరుస్తామని హామీలు ఇచ్చి మూడు సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయిందని ఉద్యమకారుల హామీలు నెరవేర్చాలని కొన్ని డిమాండ్ల పైన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికి ప్రయత్నించిన ఉద్యమకారులను అణిచివేసే విధంగా ఉద్యమకారులను నీరు కార్చే విధంగా ఈరోజు బెల్లంపల్లిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం జరిగింది వెంటనే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు అందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని లేనియెడల ఉద్యమ కార్యక్రమాలు రూపుదిద్దుకుంటామని హెచ్చరిస్తున్నాం.
తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్స్
1, తెలంగాణ ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలి
2, తెలంగాణ కోసం పనిచేసిన ఉద్యమకారులకు పెన్షన్లు ఇవ్వాలి
3 ప్రతి ఉద్యమకారుడికి ఇల్లు మంజూరు చేయాలి
4, ట్రైన్లలో బస్సులలో ప్రయాణించేందుకు ఉచితంగా పాసులు ఇవ్వాలి
5, ప్రతి ఉద్యమకారుడు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి
6 ఉద్యమకారుల ఇంటికి 20 లక్షల వరకు వర్తించే హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు జారీ చేయాలి
వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్టు అయిన వారిలో తెలంగాణ ఉద్యమకారులు ఎలిగేటి శ్రీనివాస్ పసులేటి వెంకటేష్, ఎరుకల సుందర్రావు, పరిష రవిశ్వర్, విజ్జగిరి రాజేందర్, చిట్యాల మధు, శంకర్ సింగ్.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
