Homeఆదిలాబాద్KGBV Inspection | విద్యార్థుల వికాసానికి ఆచరణాత్మక బోధనే ముఖ్యం

KGBV Inspection | విద్యార్థుల వికాసానికి ఆచరణాత్మక బోధనే ముఖ్యం

  • కేజీబీవీలో మౌలిక వసతులు కల్పిస్తాం
  • జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్: విద్యార్థులు పాఠ్యాంశాలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా, నిత్యజీవిత అనుభవాలతో అనుసంధానం చేసుకొని నేర్చుకునేలా ఆచరణాత్మక బోధన అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సూచించారు.

మంగళవారం కుంటాల మండలం కల్లూరు గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ(KGBV Inspection) చేశారు. ఈ సందర్భంగా వసతి గృహం, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించి విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

- Advertisement -

వసతి గృహ ప్రాంగణంలో ప్రతిరోజూ మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం అన్ని పూటలా నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించాలని సూచించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు శాతం వందకు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వసతి గృహంలోని నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ.4.80 లక్షలు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు. డ్రైనేజీ నిర్మాణంతో పాటు అవసరమైన ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోతుల బెడద నివారణకు సోలార్ కంచె ఏర్పాటు చేస్తామని తెలిపారు. తరగతి గదుల్లో విద్యార్థుల అవసరాన్ని బట్టి ప్రాధాన్యత క్రమంలో బెంచీలు సమకూరుస్తామని పేర్కొన్నారు.

Nirmal Collector Bhavesh Mishra KGBV Inspection3

అనంతరం పదో తరగతి విద్యార్థులతో కలెక్టర్ ముఖాముఖిగా మాట్లాడారు. వారి చదువు, విద్యా ప్రగతిపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం జీవశాస్త్రంలోని ఒక అంశాన్ని స్వయంగా బోధించి, విద్యార్థులను ప్రశ్నలు అడుగుతూ వారి అవగాహనను పరిశీలించారు.

పాఠ్యాంశాలను నిత్యజీవితంలోని అంశాలతో అనుసంధానం చేసుకొని చదివితే విషయ పరిజ్ఞానం మరింత మెరుగుపడుతుందని విద్యార్థులకు సూచించారు. వివిధ రకాల కూరగాయలను తెప్పించి వాటి బరువును విద్యార్థులతో ముందుగా అంచనా వేయించారు. అనంతరం తూనిక యంత్రంతో బరువును కొలిపించి సరైన అంచనా వేసిన విద్యార్థులను అభినందించారు. వారికి పెన్నులను బహుమతులుగా అందించారు. నిత్యజీవితంలోని చిన్న చిన్న అంశాల నుంచి కూడా విజ్ఞానాన్ని పొందాలని సూచించారు.

Nirmal Collector Bhavesh Mishra KGBV Inspection2 1

ఈ తనిఖీల్లో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసీల్దార్ కమల్ సింగ్, ఎంపీఓ శోభన, ఎంఈఓ ముత్యం, సర్పంచ్ దశరథ్, సర్వే అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News