HomeతెలంగాణMaha Padayatra | నవంబర్ 2న బీజేపీ మహా పాదయాత్ర

Maha Padayatra | నవంబర్ 2న బీజేపీ మహా పాదయాత్ర

  • ముఖ్య అతిథిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా

హైదరాబాద్: ఎస్‌ఐఆర్‌ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌)పై కాంగ్రెస్‌, ఇండీ కూటమి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు నవంబర్ 2న హైదరాబాద్‌లో బీజేపీ మహా పాదయాత్ర(Maha Padayatra) నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అనే నినాదంతో నవంబర్ 2వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన ట్యాంక్‌బండ్‌పై స్వామి వివేకానంద విగ్రహం వద్ద ప్రారంభమై, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగనుంది.

- Advertisement -

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, శాసనమండలి పక్షనేత ఏవీఎన్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు సహా పలువురు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

ఎస్‌ఐఆర్‌ అంశంపై కాంగ్రెస్‌, ఇండీ కూటమి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని బీజేపీ ఆరోపించింది. దేశ ప్రయోజనాల కంటే స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్న విపక్షాల వైఖరిని ప్రజాక్షేత్రంలో ఎండగట్టడంతో పాటు, ఈ అంశంపై ప్రజలకు వాస్తవాలను వివరించడమే మహా పాదయాత్ర(Maha Padayatra) ప్రధాన ఉద్దేశమని వెల్లడించింది.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, జాతీయవాదులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News