Homeవరంగల్‌Cybercrime Awareness | సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి...

Cybercrime Awareness | సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి…

  • హై స్కూల్ విద్యార్థులకు సూచించిన ఏటూరు నాగారం ఏఎస్పీ మనన్ భట్…

వెంకటాపురం: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఏటూరు నాగారం ఏ ఎస్ పి మనం భట్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ నేరాల పట్ల జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుత తరుణంలో రోజురోజుకు సైబర్ నేరాలు అధికమవుతున్నాయని, సైబర్ నేరాలు పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన(Cybercrime Awareness) ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు సూచించారు. ప్రతి ఒక్కరూ ఎంతో అప్రమత్తతదో వ్యవహరించి సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలని తెలిపారు. అనవసరమైన ఫోన్ కాల్స్ ను, మెసేజ్లను స్పందించవద్దని వివరించారు. ఈ సమావేశంలో వెంకటాపురం సిఐ ముత్యం రమేష్, ఎస్సై కొప్పుల తిరుపతిరావు, హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు జీవీవి సత్యనారాయణ, పోలీస్ సిబ్బందితోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News