- ఎలాంటి పేపర్ లేకుండానే తన అనుచర వర్గంతో పట్టపగలే మరల కబ్జాలు చేస్తున్న తోకల శ్రీనివాస్ రెడ్డి..
- గిర్నిబావిలో భూ ఆక్రమణలు చేస్తూ అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న వైనం..
- పట్టపగలే జ్యోతిరావు పూలే పాఠశాల స్థలంలోని కనీలను తొలగించి, ప్లాట్ల స్థలాన్ని చదును చేసి రాళ్ళు పాతిన దుర్మార్గం..
- తోకల శ్రీనివాస్ రెడ్డి అరాచకాలను కట్టడి చేసి రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్న ప్లాట్ల యజమానులు..
- గతంలో ఇలాగే కబ్జాకు యత్నిస్తే నాటి కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకున్న మారని వక్ర బుద్ధి..
- కోర్టు ఆదేశాలు ఉన్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన బుద్దే సదానందం..
- గతంలో దుగ్గొండి పోలీస్ స్టేషన్ లో ఇదే తరహాలో కబ్జా చేస్తే నమోదైన కేసు..
- పంచాయతీ కార్యదర్శి తక్షణమే అక్రమంగా పాతిన రాళ్లను తక్షణమే తొలగించి అమాయక ప్రజలకు నష్టం లేకుండా చేయాలంటున్న ప్లాట్ల యజమానులు..
- వరంగల్ జిల్లా కలెక్టర్ స్పందించి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్న తోకల శ్రీనివాస్ రెడ్డి ముఠాపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్న స్థానిక ప్రజలు..
శాంతిభద్రతలకు నిలయంగా ఉండాల్సిన ప్రాంతాలు ఇప్పడు కబ్జాకోర్ల అడ్డగా మారుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కుతూ, అమాయక ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టడమే లక్ష్యంగా కొందరు అసాంఘిక శక్తులు రెచ్చిపోతున్నారు. వరంగల్ జిల్లా, దుగ్గొండి మండలంలోని గిర్నిబావి ప్రాంతంలో వెలుగు చూసిన ఒక భూ ఆక్రమణ ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఎలాంటి చట్టబద్ధమైన పత్రాలు, అనుమతులు లేకుండానే తోకల శ్రీనివాస్ రెడ్డి తన అనుచర వర్గంతో కలిసి సాగిస్తున్న అరాచకాలు హద్దులు మీరుతున్నాయి. పట్టపగలే యథేచ్ఛగా సాగుతున్న ఈ భూదందాలపై బాధితులు, స్థానిక ప్రజల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఎలాంటి హక్కు పత్రాలు లేకపోయినా, అధికార వ్యామోహన్ని చూసుకొని తోకల శ్రీనివాస్ రెడ్డి గిర్నిబావిలో(Girnibavi) దురాక్రమణలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. ఇందులో భాగంగానే, మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల వెనుక భాగంలో ఉన్న కనీలను తొలగించారు..ఖాళీ స్థలంతో పాటు, చట్టబద్ధంగా కొనుగోలు చేసుకున్న పలువురు అమాయక ప్లాట్ల యజమానుల స్థలాలను కూడా యదేచ్చగా చదును చేసి, రాళ్లు పాతిన వైనం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది..

ట్రాక్టర్లతో భూమిని చదును చేస్తూ అమాయక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఈ ముఠా అరాచకాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి.. గతంలో ఇదే తరహాలో కబ్జాకు ప్రయత్నించారు ఈ తోకల శ్రీనివాస్ రెడ్డి ముఠా.. చేసిన తప్పును ఒప్పుకొని నేడు కబ్జాకు తెరలేపడం వీరి అక్రమాలకు ఆజ్యం పోసినట్లు అవుతుంది..గతంలో దుగ్గొండి పోలీస్ స్టేషన్లో ఇదే స్థలాన్ని కబ్జా చేస్తే వీరిపై ఎఫ్.ఐ.ఆర్ నెంబర్ 35/2021 గా నమోదైన విషయం విదితమే.. అయిన వీరి వక్ర బుద్ధిని చూపుతూ నేడు మరల ప్రభుత్వ ఆధీనంలో ఉన్న స్థలంలో కనీలను ధ్వంసం చేయడం..ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే అవుతుందనీ భూ యజమానులు ఆరోపించారు..

దీనిపై ప్రభు త్వమే నేడు యజమానిగా ఉంది కాబట్టి ప్రభుత్వ అధికా రులే పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసి ల్యాండ్ గ్రాబింగ్ కేసు నమోదు చేయాలని వారు ఆరోపించారు.. తోకల శ్రీనివాస్ రెడ్డి ఇతని ముఠా కలసి రౌడీల లాగా వ్యవహరిస్తూ చేస్తున్న కబ్జాల పై విచారణ జరిపి తోకల శ్రీనివాస్ రెడ్డి పై రౌడీషీట్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత ప్లాట్ల యజమానులు.. పంచాయతీ రాజ్ చట్టం 2002 నిబంధనల ప్రకారం నేడు అక్రమంగా పాఠశాల వెనుక భాగంలో పాతిన రాళ్లను తక్షణమే తొలగించి అమాయక పైసా పైసా కూడబెట్టుకొని కొనుకున్న ప్లాట్ల యజమానులకు నష్టం వాటిల్లకుండా చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత ప్లాటు యజమానులు..
కోర్టు ఆదేశాలను సైతం లెక్కచేయని వక్రబుద్ధి : ఈ అక్రమాలపై బాధితులు ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, స్పష్టమైన కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, చట్టాన్ని, న్యాయస్థానాన్ని లెక్కచేయకుండా శ్రీనివాస్ రెడ్డి తన కబ్జా పర్వాన్ని కొనసాగిస్తున్నారని బాధితులలో ఒకరైన బుద్దే సదానందం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. గతంలోనూ ఇదే ప్రాంతంలో ఇలాగే కబ్జాలకు యత్నించగా, నాటి వరంగల్ జిల్లా కలెక్టర్ స్పందించి కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది.. అయినా సరే, ఆ వ్యక్తిలో ఎలాంటి మార్పు రాకపోగా, మరింత బరితెగించి పాత పద్ధతిలోనే అక్రమాలకు పాల్పడుతు కబ్జాలు చేస్తుండటం గమనార్హం. గతంలో దుగ్గొండి పోలీస్ స్టేషన్లోనూ ఇదే తరహాలో చేసిన విషయం పై ఇతని అనుచర వర్గం పై కబ్జా కేసు నమోదై ఉందంటే ఈ అరాచకాల తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

అమాయక ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న వైనం : గిర్నిబావిలో దర్జాగా స్థలాలను కబ్జా చేయడం, రాత్రికి రాత్రే గ్రామ పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు తొలగించడం,అధికారులనుసైతం బెదిరింపులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేయడం ఇతనికి వెన్నెతో పెట్టిన విద్యగా మారిందని అన్నారు..కబ్జా చేసిన స్థలాలను ఏమాత్రం సంబంధం లేని అమాయక ప్రజలకు నమ్మబలికి విక్రయించి భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని, కష్టపడి ప్లాట్లు కొనుక్కున్న నిజమైన యజమానులు ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది.. పంచాయతీ రాజ్ చట్ట నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పాతిన రాళ్లను తక్షణమే తొలగించాలని, అమాయక ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని ప్లాట్ల యజమానులు డిమాండ్ చేస్తున్నారు.
కలెక్టర్ స్పందించి రౌడీషీట్ ఓపెన్ చేయాలి : ల్యాండ్ గ్రాబింగ్ ముఠాగా మారిపోయిన తోకల శ్రీనివాస్ రెడ్డి, ఆయన అను చరుల అరాచకాలను పూర్తిగా కట్టడి చేయాల్సిన అవసరం ఎంతై నా ఉంది.. ఈ ముఠా ఆటకట్టించేందుకు పోలీసులు తక్షణమే స్పందించి తోకల శ్రీనివాస్ రెడ్డిపై రౌడీషీట్ ఓపెన్ చేయాలని ప్లాట్ల యజమానులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ గారు ఈ ఉదంతాన్ని సీరియస్గా పరిగణించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపించి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ల్యాండ్ గ్రాబర్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని స్థానిక ప్రజలు, బాధితులు కోరుతు న్నారు.
చట్టం తన పని తాను చేసుకుపోతుందని నమ్మేలా అధి కారులు స్పందిస్తారా? లేదా? అన్నది ఇప్పుడు వేచి చూడాల్సిందే! ఇదే గిర్నీబావి లోని నాగన్న కుంటను పూడ్చి కబ్జా చేసిన వ్యవహారం, అక్ర మంగా కబ్జాకోసం వేసిన సీసీరోడ్డు ఎక్కడి నుండి నిధులు మంజూరు అయ్యాయో..తోకల శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న కబ్జాల పై,అక్రమాల పై మరిన్ని వివరాలను పూర్తి ఆదా రాలతో సహా మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకురానుంది..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
