- గురునానక్ మందిర్‌లో ప్రత్యేక ప్రార్థనలు.. సమస్యల పరిష్కారానికి హామీ
సంగారెడ్డి: గత గురునానక్ జయంతి సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి పట్టణంలోని బ్రాహ్మణవాడలో గురునానక్ మందిర్(Guru Nanak Mandir) కమాన్ల నిర్మాణానికి జగ్గారెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. మందిర్ ప్రవేశ మార్గంలో ఒకటి, భవాని మందిర్ రోడ్డులో మరొకటి చొప్పున రెండు కమాన్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

అంతకుముందు గురునానక్ మందిర్‌ను(Guru Nanak Mandir) సందర్శించిన జగ్గారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర్ ప్రతినిధులు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా, వాటిని త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మందిర్ ప్రాంగణంలోని రావిచెట్టు కింద ఉన్న నాగదేవత ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్‌కు సూచించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాలను యథాస్థానంలో ఉంచి అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో సిక్కు ప్రముఖులు డాక్టర్ సర్దార్ సురేందర్ గోపి సింగ్, సర్దార్ తేజేందర్ సింగ్, సర్దార్ స్వరణ్ సింగ్, సర్దార్ సత్‌పాల్ సింగ్, డాక్టర్ సర్దార్ భరత్ సింగ్, సిక్కు గురువు గురుదేవ్ సింగ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్‌పర్సన్ కూన వనిత సంతోష్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి, సుదీప్, నరేన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
