Homeమెదక్‌Papannapet ZPHS | సెలవుల్లోనూ వెలుగుతున్న బల్బులు.. తిరుగుతున్న ఫ్యాన్లు!

Papannapet ZPHS | సెలవుల్లోనూ వెలుగుతున్న బల్బులు.. తిరుగుతున్న ఫ్యాన్లు!

  • ఓ వైపు ఎల్ నినో..! మరోవైపు వృధా..!!
  • విద్యుత్ పొదుపుపై పాఠాలు చెప్పాల్సిన పాఠశాలలోనే వృథా..
  • పాపన్నపేట జెడ్పీ హై స్కూల్(Papannapet ZPHS) తీరుపై అసంతృప్తి

పాపన్నపేట: విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సామాజిక బాధ్యత, వనరుల పొదుపుపై అవగాహన కల్పించాల్సిన పాఠశాలలోనే విద్యుత్ వృథా అవుతోంది. దసరా సెలవుల నేపథ్యంలో 13 రోజుల పాటు పాఠశాలకు సెలవులు ప్రకటించినప్పటికీ, పాపన్నపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలోని(Papannapet ZPHS) తరగతి గదుల్లో బల్బులు వెలుగుతూ, ఫ్యాన్లు తిరుగుతూ కనిపించడం విస్మయానికి గురిచేస్తోంది.

విద్యుత్ పొదుపుపై అవగాహన ఏదీ?

- Advertisement -

విద్యుత్ పొదుపు, పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే అవసరం లేని విద్యుత్ వినియోగాన్ని అరికట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. ముఖ్యంగా ఎల్‌నినో వంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యుత్ వనరులను పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో పాఠశాలలో కనీస జాగ్రత్తలు పాటించకపోవడం బాధ్యతాయుతమైన నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.విద్యార్థులకు చెప్పే పాఠాలు ఆచరణలోనూ కనిపించాలి. పాఠశాలకు సెలవులు ఉన్నప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆఫ్ చేయడం కనీస బాధ్యత. ప్రభుత్వ వనరుల వినియోగంపై సంబంధిత అధికారులు పర్యవేక్షణ పెంచి, ఇలాంటి విద్యుత్ వృథాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News