- 150 మందికి పైగా రక్తదానం..
- సేవా కార్యక్రమాల్లో పోలీసుల ముందడుగు.
సూర్యాపేట: పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా అమరవీరుల త్యాగాలకు గుర్తుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ కె. నరసింహ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం(Blood Donation Camp) నిర్వహించారు. ఎస్పీ స్వయంగా రక్తదానం చేసి శిబిరాన్ని(Blood Donation Camp) ప్రారంభించారు. పోలీసు సిబ్బందితో పాటు ఆటో యూనియన్ సభ్యులు, స్థానిక పౌరులు ఉత్సాహంగా పాల్గొని 150 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రమాదాల్లో గాయపడిన వారికి అత్యవసర సమయాల్లో రక్తం ఎంతో అవసరమని తెలిపారు. సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రాకుండా ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఖమ్మంకు చెందిన తలసేమియా, సికిల్ సెల్ సొసైటీ ప్రతినిధులు కూడా వ్యాధులతో బాధపడుతున్న పిల్లలకు ఉపయోగపడేలా రక్తాన్ని సేకరించారు. ప్రజాసేవలో పోలీసులు ఎల్లప్పుడూ ముందుంటారని, అత్యవసర సమయాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటామని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రజలు గుర్తించాలని, శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, సీఐలు రాజశేఖర, నాగేశ్వరరావు, వెంకటయ్య, రామారావు, శివకుమార్, ఆర్ఐలు ప్రవీణ్ కుమార్, జానయ్య, పోలీసు సంఘం అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి కిరణ్, సంఘం సభ్యులు, పోలీసు సిబ్బంది, ఆటో యూనియన్ సభ్యులు, స్థానిక పౌరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
