Homeనిజామాబాద్‌Cybercrime Awareness | సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి

Cybercrime Awareness | సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి

  • ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసరావు.

తాడ్వాయి: ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా(Cybercrime Awareness) ఉండాలని, వాట్సాప్ లో వచ్చే లింకులను అనవసరంగా ఓపెన్ చేయద్దని, అనుమానస్పదంగా వచ్చే ఫోన్ నెంబర్లను లిఫ్ట్ చేయవద్దని ఎల్లారెడ్డి డి.ఎస్.పి శ్రీనివాసరావు అన్నారు ఆయన శుక్రవారం మండలంలోని సంతయిపేట గ్రామంలో సైబర్ నేరాలు, మారకద్రవ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితిలో 1903 సేవలను వినియోగించుకోవాలని బాల కార్మిక వ్యవస్థను, బాల్యవివాహలను పూర్తిగా నిర్మూలించాలని అందుకు ప్రజలు సహకరించాలన్నారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులు సూచించారు. అదేవిధంగా సైబర్ నేరగాళ్ల మోసపూరిత ఫోన్ కాల్స్, మెసేజ్‌లు, లింకులు మరియు ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ వివరాలను ఎవరికీ తెలియజేయవద్దని సూచించారు. మురియు రోడ్డు ప్రమాదాల గురించి, రోడ్డు భద్రత నియమాలు పాటించి రోడ్డు ప్రమాదాలను నివారించాలని వివరించారు.

- Advertisement -

బాలలను పనిలో పెట్టకుండా వారి విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని, బాల్య వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని, బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్థులు సుమారు 100 మంది పాల్గొని, పోలీసుల సూచనలను పాటిస్తూ సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల(Cybercrime Awareness) నియంత్రణ, బాల కార్మిక వ్యవస్థ మరియు బాల్య వివాహాల నిర్మూలనకు సహకరిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమం లో నగర్ సీఐ వీరయ్య, తాడ్వాయి ఎస్ఐ నరేష్, గ్రామ పెద్దలు, యువకులు పాలొగొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News