Homeనల్లగొండChintalapalem | బతుకమ్మ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలి.

Chintalapalem | బతుకమ్మ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలి.

  • నిమజ్జన కుంటపై స్పష్టత కరువైందని స్థానిక మహిళల ఆవేదన…
  • అధికారుల ఉదాసీనతపై ఆగ్రహం…

చింతలపాలెం: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల నిర్వహణలో స్థానిక గ్రామ పంచాయతీ అధికారుల తీరుపై మండల కేంద్రమైన చింతలపాలెం(Chintalapalem) ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.వేడుకల్లో అత్యంత కీలకమైన బతుకమ్మ నిమజ్జనానికి సంబంధించి గ్రామంలో సరైన ఏర్పాట్లు చేపట్టకపోవడంపై స్థానిక మహిళలు,గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు.బతుకమ్మ నిమజ్జనం కోసం ప్రత్యేకంగా కుంటను సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ అది గ్రామంలో ఎక్కడ ఉందో ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు పేర్కొంటున్నారు.

ప్రతి ఏటా మహిళలు ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకునే ఈ పూల పండుగకు సంబంధించి నిమజ్జన స్థలంపై కనీస స్పష్టత ఇవ్వకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు, గ్రామ పంచాయతీ పాలకవర్గం తక్షణమే స్పందించి, నిమజ్జన ఏర్పాట్లు చేసి మౌలిక సదుపాయాలు కల్పించాలని బతుకమ్మ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని చింతలపాలెం ప్రజలు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News