HomeసినిమాChandrayan | "చంద్రయాన్" సినిమా సెన్సార్ పూర్తి

Chandrayan | “చంద్రయాన్” సినిమా సెన్సార్ పూర్తి

రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో “చంద్రయాన్” (Chandrayan) టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన “చంద్రయాన్” సినిమా ఈ నెల 30న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

Chandrayan Movie Receives Certificate 33

తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బృందం యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సరికొత్త కథా కథనాలతో మంచి ఎంటర్ టైనింగ్ సినిమా చేశారంటూ సెన్సార్ టీమ్ ప్రశంసించారు. ఇటీవలే రిలీజ్ చేసిన “చంద్రయాన్” (Chandrayan) చిత్ర గ్లింప్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నెల 30న థియేటర్స్ లో స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న అడ్వెంచర్ ఫన్ మూవీ చూడబోతున్నామనే ఇంప్రెషన్ ఈ చిత్ర ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల్లో కలుగుతోంది. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -

నటీనటులు – శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ, తదితరులు

టెక్నీషియన్స్

కాస్ట్యూమ్ డిజైనర్ – శశి కోసూరి
ఎడిటర్ – పుల్లారావు దాసరి
ప్రొడక్షన్ డిజైనర్స్ – శ్రీధర్ మేస్త్రి, మందర్ పస్నేకర్
డీవోపీ – శ్రీనివాస. బి.
మ్యూజిక్ – హర్ష ప్రవీణ్
సమర్పణ – వేణు ఊడుగుల
ప్రొడ్యూసర్ – ప్రవీణ్ మొలక
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ – శ్రీనాథ్ చంద్రశేఖర్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)

- Advertisement -
RELATED ARTICLES

Latest News