Homeఆదిలాబాద్Dr. Jayakrishna Reddy | నేడు నిర్మల్‌లో ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడి సేవలు

Dr. Jayakrishna Reddy | నేడు నిర్మల్‌లో ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడి సేవలు

  • రోబోటిక్‌ జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌, స్పోర్ట్స్‌ మెడిసిన్‌లో ప్రత్యేక నైపుణ్యం

నిర్మల్‌, కీళ్ల నొప్పులు,మోకాళ్ల సమస్యలు, క్రీడా గాయాలతో బాధపడుతున్న వారికి నేడు ప్రత్యేక వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. 20 ఏళ్లకు పైగా వైద్య అనుభవం కలిగిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ జయకృష్ణ రెడ్డి (Dr. Jayakrishna Reddy) నిర్మల్‌ పట్టణంలో ఔట్‌పేషెంట్‌ వైద్య సేవలు అందించనున్నారు. ప్రతి నెల రెండో గురువారం నిర్మల్‌లో నిర్వహించే ప్రత్యేక ఓపీ కార్యక్రమంలో భాగంగా నేడు ఆయన రోగులను పరీక్షించనున్నారు. రోబోటిక్‌ మోకాలు, తుంటి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలతో పాటు ఆర్థ్రోస్కోపిక్‌ శస్త్రచికిత్సలు, క్రీడా గాయాలు, లిగమెంట్‌, మెనిస్కస్‌, భుజం గాయాలు, సంక్లిష్టమైన ప్రమాద గాయాలు, కీళ్లను సంరక్షించే చికిత్సల్లో డాక్టర్‌ జయకృష్ణ రెడ్డికి ప్రత్యేక అనుభవం ఉంది.

ఆధునిక రోబోటిక్‌ సాంకేతికతతో నిర్వహించే కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు కచ్చితత్వం, మెరుగైన కీళ్ల అమరికతో పాటు రోగుల కోలుకునే ప్రక్రియకు దోహదపడే అవకాశాలున్నాయి. ఈ అధునాతన వైద్య సేవలు నిర్మల్‌లో అందుబాటులోకి రావడంతో స్థానికంగా నిపుణుల సలహా పొందే అవకాశం రోగులకు కలుగుతోంది. మోకాళ్ల నొప్పులు, కీళ్ల సమస్యలు, ఆర్థరైటిస్‌, క్రీడా గాయాలు లేదా కీళ్ల మార్పిడిపై నిపుణుల సలహా కోరుకునే వారు నేడు వైద్యుడిని సంప్రదించవచ్చు. ముందస్తు అపాయింట్‌మెంట్‌ కోసం 9154989214 నంబర్‌లో సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. దేవేందర్‌ రెడ్డి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, సూర్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ఈ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News