Homeఅంతర్జాతీయంAmerican AI | అమెరికా ఏఐ ఇంటెలిజెన్స్ లో సంచలనం..

American AI | అమెరికా ఏఐ ఇంటెలిజెన్స్ లో సంచలనం..

  • తెరపైకి పలు ఆరోపణలు..
  • మాజీ పరిశోధకుడు జాకబ్ వెల్లడి..

అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (American AI) రంగంలో సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. చైనాకు చెందిన గూఢచారులు ఇప్పటికే అమెరికా ప్రముఖ ఏఐ సంస్థలు ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌లోకి చొరబడ్డారని మాజీ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఆరోపించారు. ఈ విషయం 90 శాతం నిజమని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. అమెరికన్ వ్యాపారవేత్త ప్యాట్రిక్ బెట్-డేవిడ్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో కాక్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఎంత నమ్మకం ఉందని అడగ్గా.. ‘‘90 శాతం నమ్మకంగా ఉన్నాను’’ అని స్పష్టం చేశారు.

కాక్సన్ గతంలో ఓపెన్‌ఏఐ, ఆ తర్వాత ఆంథ్రోపిక్‌లో పరిశోధకుడిగా పనిచేశారు. ఏఐ అభివృద్ధి అత్యంత వేగంగా సాగడం మానవాళి భవిష్యత్తుకే ముప్పుగా మారొచ్చంటూ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసి ఆంథ్రోపిక్‌కు రాజీనామా చేశారు. అమెరికా ఏఐ సంస్థల్లో చైనాకు అనుకూలమైన వ్యక్తులకు అంతర్గత సమాచారం అందుబాటులో ఉంటే.. కీలక మోడళ్లను రహస్యంగా బయటకు తరలించే అవకాశం ఉందని కాక్సన్ హెచ్చరించారు. అమెరికా సాంకేతిక ఆధిక్యాన్ని చైనా ఎప్పుడైనా దెబ్బతీయగలదని పేర్కొన్నారు.

- Advertisement -

అమెరికా ఏఐ రంగంలో విదేశీ గూఢచర్యంపై ఆందోళనలు ఇప్పటికే ఉన్నాయి. చైనా సంస్థలు అమెరికా అభివృద్ధి చేసిన ఏఐ మోడళ్లను ‘డిస్టిలేషన్’ పద్ధతిలో అనుకరిస్తున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇందులో పెద్ద ఏఐ మోడల్‌ను ‘టీచర్’గా ఉపయోగించి చిన్న మోడల్‌కు శిక్షణ ఇస్తారు. అమెరికా రక్షణ సంస్థల్లో విదేశీ ఉద్యోగులపై కఠినమైన భద్రతా తనిఖీలు ఉంటాయని కాక్సన్ చెప్పారు. కానీ సిలికాన్ వ్యాలీలోని ఏఐ సంస్థల్లో ఇలాంటి తనిఖీలు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు.

ఉద్యోగుల నియామకంలో రక్షణ రంగ స్థాయి భద్రతా నిబంధనలు తీసుకురావాలని సూచించారు. అమెరికా-చైనా మధ్య ఏఐ పోటీ మరింత వేడెక్కుతోంది. సెప్టెంబరులో చైనాకు చెందిన 10 ప్రముఖ ఏఐ సంస్థలు 16 మోడళ్లను విడుదల చేసినట్లు నిక్కీ లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో అమెరికా ప్రముఖ ఏఐ సంస్థలు 10-12 కొత్త మోడళ్లు, వేరియంట్లు, ప్రత్యేక రీజనింగ్ మోడళ్లను విడుదల చేశాయి

అమెరికా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (American AI) రంగంలో సంచలన ఆరోపణలు తెరపైకి వచ్చాయి. చైనాకు చెందిన గూఢచారులు ఇప్పటికే అమెరికా ప్రముఖ ఏఐ సంస్థలు ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్‌లోకి చొరబడ్డారని మాజీ పరిశోధకుడు జాకబ్ కాక్సన్ ఆరోపించారు. ఈ విషయం 90 శాతం నిజమని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. అమెరికన్ వ్యాపారవేత్త ప్యాట్రిక్ బెట్-డేవిడ్ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో కాక్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై ఎంత నమ్మకం ఉందని అడగ్గా.. ‘‘90 శాతం నమ్మకంగా ఉన్నాను’’ అని స్పష్టం చేశారు.

కాక్సన్ గతంలో ఓపెన్‌ఏఐ, ఆ తర్వాత ఆంథ్రోపిక్‌లో పరిశోధకుడిగా పనిచేశారు. ఏఐ అభివృద్ధి అత్యంత వేగంగా సాగడం మానవాళి భవిష్యత్తుకే ముప్పుగా మారొచ్చంటూ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసి ఆంథ్రోపిక్‌కు రాజీనామా చేశారు. అమెరికా ఏఐ సంస్థల్లో చైనాకు అనుకూలమైన వ్యక్తులకు అంతర్గత సమాచారం అందుబాటులో ఉంటే.. కీలక మోడళ్లను రహస్యంగా బయటకు తరలించే అవకాశం ఉందని కాక్సన్ హెచ్చరించారు. అమెరికా సాంకేతిక ఆధిక్యాన్ని చైనా ఎప్పుడైనా దెబ్బతీయగలదని పేర్కొన్నారు.

అమెరికా ఏఐ రంగంలో విదేశీ గూఢచర్యంపై ఆందోళనలు ఇప్పటికే ఉన్నాయి. చైనా సంస్థలు అమెరికా అభివృద్ధి చేసిన ఏఐ మోడళ్లను ‘డిస్టిలేషన్’ పద్ధతిలో అనుకరిస్తున్నాయనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఇందులో పెద్ద ఏఐ మోడల్‌ను ‘టీచర్’గా ఉపయోగించి చిన్న మోడల్‌కు శిక్షణ ఇస్తారు. అమెరికా రక్షణ సంస్థల్లో విదేశీ ఉద్యోగులపై కఠినమైన భద్రతా తనిఖీలు ఉంటాయని కాక్సన్ చెప్పారు. కానీ సిలికాన్ వ్యాలీలోని ఏఐ సంస్థల్లో ఇలాంటి తనిఖీలు తక్కువగా ఉన్నాయని ఆరోపించారు.

ఉద్యోగుల నియామకంలో రక్షణ రంగ స్థాయి భద్రతా నిబంధనలు తీసుకురావాలని సూచించారు. అమెరికా-చైనా మధ్య ఏఐ పోటీ మరింత వేడెక్కుతోంది. సెప్టెంబరులో చైనాకు చెందిన 10 ప్రముఖ ఏఐ సంస్థలు 16 మోడళ్లను విడుదల చేసినట్లు నిక్కీ లెక్కలు చెబుతున్నాయి. అదే సమయంలో అమెరికా ప్రముఖ ఏఐ సంస్థలు 10-12 కొత్త మోడళ్లు, వేరియంట్లు, ప్రత్యేక రీజనింగ్ మోడళ్లను విడుదల చేశాయి. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News