Homeస్పోర్ట్స్PCB | పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాక్..

PCB | పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాక్..

  • సగం ధరకే ఇంటర్నేషనల్ మ్యాచుల ప్రసార హక్కులు..
  • పోటీలేకపోవడంతో తగ్గిన ధరలు..

పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు(PCB) కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ దేశంలో జరిగే 25 అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రసార హక్కులను నిర్ణయించిన ధర కంటే దాదాపు సగం ధరకే విక్రయించాల్సి వచ్చింది. ప్రసార హక్కుల కోసం ప్రభుత్వ టెలివిజన్‌ సంస్థ ‘పాకిస్థాన్‌ టెలివిజన్‌ కార్పొరేషన్‌’ మాత్రమే బిడ్‌ దాఖలు చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

పీసీబీ ఇటీవల ప్రసార హక్కుల కోసం టెండర్‌ జారీ చేసింది. దీనికి రూ.600 మిలియన్లను రిజర్వ్‌ ధరగా నిర్ణయించింది. గతంలో మాదిరిగా పలు సంస్థలు కలిసి కన్సార్టియంగా బిడ్‌ వేసే అవకాశం ఈసారి ఇవ్వలేదు. దీంతో పోటీ తగ్గిపోయింది. చివరకు పీటీవీ రూ.350 మిలియన్లకు బిడ్‌ వేసి హక్కులను దక్కించుకుంది. అంటే బోర్డు నిర్ణయించిన ధరతో పోలిస్తే దాదాపు రూ.250 మిలియన్లు తక్కువకే హక్కులు విక్రయించాల్సి వచ్చింది. కొత్త ఒప్పందంలో మొత్తం 25 హోమ్‌ మ్యాచ్‌లు ఉన్నాయి. ఇందులో ఐదు టెస్టులు, 14 వన్డేలు, ఆరు టీ20లు ఉన్నాయి.

- Advertisement -

ఈ నెలలో పాకిస్థాన్‌.. శ్రీలంకతో మూడు టీ20లు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్‌తో కలిసి ఏడు మ్యాచ్‌ల ట్రై సిరీస్‌ జరగనుంది. వచ్చే నెలలో శ్రీలంకతో రెండు టెస్టులు కూడా ఉన్నాయి. పాకిస్థాన్‌ జాతీయ జట్ల ఇటీవలి ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉండటం వల్ల స్పాన్సర్లు, ప్రకటనదారులు క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు గతంలో కన్సార్టియంగా ప్రసార హక్కులు తీసుకున్న కనీసం మూడు సంస్థలు పీసీబీకి ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఈసారి బిడ్‌ వేసేందుకు ఆసక్తి చూపిన సంస్థల సంఖ్య భారీగా తగ్గిపోయింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News