- స్వశక్తి మేరకు సొసైటీని లాభాల బాటలో నడిపిస్తా…
- నేను రైతునే.. రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..!
- ఎమ్మెల్యే మదన్ మోహన్ కు రుణపడి ఉంటా…
- సొసైటీ చైర్మన్ సంతాజి గారి సుధాకర్ రావు..!
తాడ్వాయి: ఆదరించండి సొసైటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా.. నేను రైతునే రైతు కుటుంబం నుంచి వచ్చా రైతుల అభ్యున్నతికి కృషి చేస్తానని తాడ్వాయి(Tadwai) సింగిల్ విండో నూతన చైర్మన్ సంతాజీ గారి సుధాకర్ రావు అన్నారు.అయన మంగళవారం సింగిల్ విండో కార్యాలయంలో డైరెక్టర్లతో కలిసి ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ తనకు చైర్మన్ పదవి ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

తాడ్వాయి సింగిల్ విండోకు ఘనమైన చరిత్ర ఉందని తన స్వశక్తి మేరకు సొసైటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని రైతులకు అందుబాటులో ఉండి రైతు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండారు సంజీవులు, మాజీ అధ్యక్షులు వెంకటరెడ్డి, సీఈవో నర్సింలు, పాలకవర్గం డైరెక్టర్లు జుకంటి వెంకట్ రెడ్డి,ప్రసాద్ రావు, గడ్డం సాయి రెడ్డి, ఏనుగు నరసవ్వ, కేసరి దత్తవ్వ, తూర్పు అనూస బాయ్, చెట్కురి రాజవ్వ,డాకూరి రమేష్ రావు,భాస్కర్ గౌడ్, గడ్డం పీరయ్య, బద్దం మల్లేష్,రాందాస్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
