- జనసంద్రంగా మారిన స్వర్ణ మహల్
మాజీ కౌన్సిలర్ జిఎస్ సేవాసమితి చైర్మన్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు(Birthday Celebrations) పెద్ద అంబర్‌పేట్ పసుమాముల స్వర్ణ మహల్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అభిమానులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల నాయకులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
వేడుకలకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, హయత్‌నగర్ మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి, కొత్త జైపాల్ రెడ్డి,లాల్ మహమ్మద్, చెవుల మణి కిరణ్ ,ఉయ్యాల రమేష్ గౌడ్ వివిధ పార్టీల , కాలనీల అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్యారాల శ్రీనివాస్ గౌడ్‌ను శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. గ్యారాల శ్రీనివాస్ గౌడ్ ధైర్యం, సేవా దృక్పథం కలిగిన నాయకుడని కొనియాడారు. ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, ప్రజాసేవలో తనదైన ముద్ర వేస్తున్నారని అన్నారు.
శ్రీనివాస్ గౌడ్ భవిష్యత్తులో మరిన్ని ఉత్తమమైన పదవులు అధిరోహించి ప్రజలకు విస్తృతంగా సేవలందించాలని మల్‌రెడ్డి రంగారెడ్డి ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం అభిమానులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో గ్యారాల శ్రీనివాస్ గౌడ్ కేక్ కట్ చేశారు. కేక్ కటింగ్ సమయంలో అభిమానులు, కార్యకర్తలు హర్షధ్వానాలు చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో అభిమానులు తరలిరావడంతో కార్యక్రమం జరిగిన ప్రాంగణం సందడిగా మారింది.
ఈ సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మాజీ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి తదితరులు శ్రీనివాస్ గౌడ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
