- పల్లె ప్రకృతి వనం పై పట్టింపు కరువు
- వారికి పల్లె ప్రకృతి వనాలను సందర్శించడానికి సమయం లేదా ..?
- తుప్పు పట్టిన ఆట వస్తువులు చెత్తాచెదారంతో దర్శనం
- పై అధికారులు గ్రామాలను సందర్శిస్తున్నారా.. లేరా..?
జగదేవపూర్: గ్రామాలను పచ్చని వాతావరణంలో నింపడానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా గ్రామాల్లో ప్రజలకు విశ్రాంతి కొరకు తెలంగాణ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లక్షల రూపాయలు వెచ్చించి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. కానీ నేడు అవి పర్యవేక్షణ లోపం వల్ల ఆ పల్లె ప్రకృతి వనాలలో పిచ్చి మొక్కలు , మందు బాబులకు అడ్డాలుగామారాయి అంతే కాకుండా లక్షల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసిన ఆటవస్తువులు తుప్పు పట్టి మూలన పడి ఆడుకోడానికి వచ్చిన వారికి మూలకు పడి దర్శనమిస్తున్నాయి.
కనీసం గేటులకు తాళం లేకుండా వైరుముక్క సహాయంతో అమర్చారు. జగదేవపూర్ మండలంలోని(Jagadevpur Mandal) గొల్లపల్లి, అంతాయిగూడెం, చాట్లపల్లి గ్రామాల్లో కాకుండా మండలంలోని పలు గ్రామాల్లో ఇదే తంతు కొనసాగుతుంది.గ్రామంలోనీ పల్లె ప్రకృతి వనం కాస్త పిచ్చి మొక్కలు, చెత్తాచెదారంతో నిండి ఉంది . ఇలా పిచ్చి మొక్కలు మొలచిన పల్లె ప్రకృతి వనాన్ని చూసిన గ్రామస్తులకు ఆ పంచాయతీ కార్యదర్శులు గ్రామానికి వస్తున్నారా లేరా అనే సందేహం గ్రామాల్లో నెలకొంది. ఒకవేళ వస్తే ఆ పంచాయతీ కార్యదర్శులు పల్లె ప్రకృతి వనం పై ఒక్కరోజు కూడా కన్నెత్తి చూడడం లేదా అంటూ గుసగుసలాడుకుంటున్నారు.

ఒకవేళ చూసిన చూడనట్టు వ్యవహరిస్తున్నారా అనే సందేహం గ్రామ ప్రజలకు కలుగుతుంది. అంతేకాకుండా గొల్లపల్లి పల్లె ప్రకృతి వనం గేటుకు కనీసం 50 రూపాయలు ఖర్చు చేసి గేటుకు తాళం వేయలేని స్థితిలో ఆ పంచాయతీ ఉందా అంటూ గ్రామస్తులకు సందేహం కలుగుతుంది. తాళం బిగించలేక గేటుకు వైర్ అమర్చారంటే ఆ పంచాయతీ కార్యదర్శి పనితీరు అర్థం అయితుందని పలువురు ముచ్చటించుకుంటున్నారు. ఇప్పటికైనా పై అధికారులు స్పందించి చెత్తాచెదారంతో పిచ్చి మొక్కలతో ఉన్న పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి లోపల భాగం నుండి గేటుకు అమర్చిన వైర్లు కాస్త సరిచేసి ముందు భాగం తాళం బిగించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
