Homeమెదక్‌Sadashivpet | సదాశివపేట వినాయక నిమజ్జనానికి పకడ్బందీ బందోబస్తు

Sadashivpet | సదాశివపేట వినాయక నిమజ్జనానికి పకడ్బందీ బందోబస్తు

  • డీజేలు, కల్తీ మద్యం, ఆకతాయిలపై అధికారుల ఉక్కుపాదం!
  • ​శుక్రవారం 25న నిమజ్జనం.. డీజేలపై సీఐ వెంకటేష్ స్ట్రాంగ్ వార్నింగ్

సదాశివపేట: సదాశివపేటలో ఈ నెల 25వ తేదీ శుక్రవారం నాడు జరగనున్న వినాయక నిమజ్జనోత్సవాల్లో డీజేల అనుమతుల కోసం చోటా నాయకుల నుంచి బడా నేతల వరకు పైరవీలు నడుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా తగ్గేదే లేదని సీఐ వెంకటేష్ స్పష్టం చేశారు. “నిమజ్జనంలో డీజేలకు ఎలాంటి అనుమతి లేదు; రోడ్లపైకి తెస్తే వాహనాలతో సహా సీజ్ చేసి, తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం” అని హెచ్చరించారు.

​మద్యం మత్తులో పిచ్చి చేష్టలు చేస్తే తాట తీస్తాం:

- Advertisement -

నిమజ్జనం పరిసరాల్లో మద్యం సేవించి నీళ్లలోకి దిగినా, మద్యం మత్తులో అసభ్య నృత్యాలు, పిచ్చి చేష్టలతో భక్తులకు భంగం కలిగించినా సహించే ప్రసక్తే లేదని అధికారులు తేల్చిచెప్పారు. నీటి లోతుల్లోకి దిగడం ప్రమాదకరమని, ఉల్లంఘించిన వారిపై అక్కడికక్కడే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

​కల్తీ మద్యంపై ఎక్సైజ్ శాఖ కొరడా:Sadashivpet

ఉత్సవాల వేళ పట్టణంలో గానీ, పరిసర గ్రామాల్లో గానీ కల్తీ మద్యం అమ్మినా, నిల్వ ఉంచినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు స్పష్టం చేశారు. అక్రమ మద్యం దందాలపై నిరంతర నిఘా ఉంచామని, నిబంధనలు మీరితే జైలుకు పంపుతామని హెచ్చరించారు.

​రంగంలోకి పోలీస్, రెవెన్యూ, మున్సిపల్, కరెంట్, ఇరిగేషన్, అగ్నిమాపక యంత్రాంగం:Sadashivpet

నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేందుకు పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో పాటు విద్యుత్ (కరెంట్), ఇరిగేషన్, అగ్నిమాపక (ఫైర్) శాఖలు సర్వసన్నద్ధమై క్షేత్రస్థాయిలో మోహరించాయి. ​రక్షణ ఏర్పాట్లు: ఘాట్ల వద్ద లైఫ్ జాకెట్లు, రక్షణ వలయాలు, తాళ్లతో పాటు విద్యుత్ తీగల వద్ద ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు.

​నిరంతర నిఘా: డ్రోన్లు, సీసీ కెమెరాలు, బ్రీత్ అనలైజర్లతో పకడ్బందీ నిఘా ఉంటుంది.

​అధికారులకు సహకరించాల్సిందే: నూతన కమిటీ సభ్యులు, ప్రజలందరూ ఈ అధికారులందరికీ పూర్తిస్థాయిలో సహకరించాలని, విధులకు ఆటంకం కలిగించినా, గొడవలు చేసినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. (https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News