- డాక్టర్ కె.ఏ. పాల్‌తో అమెరికా స్పీకర్ మైక్ జాన్సన్
ప్రపంచ శాంతి, మానవతా సహకారం, ఆర్థిక అభివృద్ధి కోసం సెప్టెంబర్ 23న వాషింగ్టన్(Washington) డీసీలో గ్లోబల్ పీస్ అండ్ ఎకనామిక్ సమ్మిట్ జరగనుంది. గ్లోబల్ పీస్ ఇనిషియేటివ్ వ్యవస్థాపకుడు డాక్టర్ కె.ఏ. పాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సులో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన రాజకీయ నాయకులు, వ్యాపార ప్రతినిధులు, మానవతా సంస్థల ప్రతినిధులు, మత పెద్దలు, సామాజిక వర్గాల ప్రతినిధులు, శాంతి కార్యకర్తలు పాల్గొననున్నారు.
సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు క్యాపిటల్ హిల్టన్‌లో జరిగే ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సాయుధ ఘర్షణలు, మానవతా సంక్షోభాలు, నిరాశ్రయులైన కుటుంబాల సమస్యలు, ఆహారం, వైద్యం, నివాసం, విద్య వంటి ప్రాథమిక అవసరాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 58 యుద్ధాలకు శాంతియుత పరిష్కార మార్గాలను అన్వేషించడం, ఘర్షణల పరిష్కారం, మానవతా సహాయ కార్యక్రమాల్లో అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం సదస్సు ప్రధాన లక్ష్యాల్లో ఉన్నాయి. రాజకీయ, మత, జాతీయ విభేదాలకు అతీతంగా ప్రపంచ దేశాలు, ప్రజలు, పౌర సమాజ సంస్థలు, వ్యాపార సంస్థలు, మత సంస్థలు, మానవతా సంస్థలు కలిసి పనిచేయాలని డాక్టర్ కె.ఏ. పాల్ పిలుపునిస్తున్నారు.
గత 45 ఏళ్లలో 155 దేశాల్లో శాంతి, మానవతా కార్యక్రమాల్లో పాల్గొన్న అనుభవం తనకు ఉందని డాక్టర్ పాల్ తెలిపారు. కులం, మతం, వర్గ భేదాలకు అతీతంగా సమష్టి కార్యాచరణతో శాంతి, మానవతా బాధ్యత, అంతర్జాతీయ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడమే సదస్సు లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు. మైక్ జాన్సన్ కూడా డాక్టర్ కె.ఏ. పాల్‌తో కలిసి ప్రపంచ నాయకులు, ప్రజలు ఈ సదస్సులో పాల్గొనాలని కోరుతూ వీడియో సందేశాల్లో పిలుపునిచ్చారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
