HomeతెలంగాణSand Mafia | మంత్రుల్లో ‘మాఫియా చుట్టాలు’

Sand Mafia | మంత్రుల్లో ‘మాఫియా చుట్టాలు’

  • ఇసుక రాబంధుల ఉచ్చులో అందరి బంధువులు
  • మంచోళ్ళ పేరును ముంచేసిన ఇసుకాసురులు
  • కొందరికే పరిమితమైన “అందరివాళ్లు”
  • నాడు ప్రజలతో మమేకం.. నేడు మాఫియాకి స్నేహ “హస్తం”
  • కలలో కూడా ఊహించని పరిణామాలు
  • పదవుల్లోకి వచ్చాక “పరేషాన” అయ్యేలా నిర్ణయాలు
  • ఇద్దరి మంత్రులకు ఇసుక బురద
  • ప్రతిపక్షంలో ఉండగా ప్రజలకు “భరోసా”
  • అధికారంలోకి రాగానే అక్రమార్కులకు “శ్రీరామరక్ష”
  • మంత్రుల పేరును వాడుకుంటూ మాఫియా ఆగడాలు
  • ఇసుక రచ్చలో కాంగ్రెస్ పెద్దలు
  • ఆ మంత్రులు మేల్కొనకపోతే పరిస్థితులు తారుమారు

ప్రతిపక్షంగా ఉన్న రోజుల్లో వారిద్దరూ ప్రజల మనుషులు.. ప్రజలతో మమేకమైన జీవనం వారిది.. అప్పట్లో అధికారంలో లేకపోయినా ప్రజలకు భరోసాగా ఒక బాధ్యతాయుతమైన పాత్రను పోషించారు. అధికార దర్పానికి దూరంగా ఉన్న రోజుల్లో వారిద్దరూ అందరివాళ్ళు. ప్రజలతో ప్రేమపూర్వకంగా చిరునవ్వులతో దగ్గరగా ఉండేవారు. ఏ సమస్య వచ్చినా ఆదుకునేవారు. సేవా దృక్పథంలో వారికి వేరే ఎవరూ సాటి లేరు అనే విధంగా వారి కార్యాచరణ ఉండేది.

విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డి మరి జనంతో మమేకమైన రాజకీయ గమనం వారిది.. వారున్నారనే కొండంత ధైర్యాన్ని గుండెల్లో నింపుకొని అటు పార్టీ కార్యకర్తలు ఇటు ప్రజల సైతం వారిని సొంతింటి మనుషులుగా కొలిచిన పరిస్థితులు ఉండేవి. అలాంటి వారిద్దరూ అధికారంలోకి వచ్చాక కొందరి వారయ్యారు. మంత్రులుగా గురుతరమైన బాధ్యతలో ఉన్నవారు ఎందుకో మాఫియాకు దగ్గరయ్యారనే అపవాదులు మాత్రం ఎదుర్కొంటూనే ఉన్నారు..

- Advertisement -

తెలంగాణ ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఇద్దరు మంత్రులు ఇసుక మాఫియాకు(Sand Mafia) దగ్గరగా ఉన్నారనే విమర్శలను ఎదుర్కొంటున్నారు. నిజానికి వారిద్దరూ అధికారానికి దూరంగా ఉన్న రోజుల్లో ప్రజల మనుషులుగా గుర్తింపు పొందారు. ప్రజలతో పూర్తిగా మమేకమై, వారి పట్ల బాధ్యతయుతంగా ఉంటూ భరోసాతో కూడిన రాజకీయాలను చేసేవారు. నిత్యం ప్రజలతోనే మమేకమై వారి సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు శ్రమించేవారు. జనానికి మేమున్నాం అనే భరోసాని మనోధైర్యాన్ని కల్పించే దిశగా వారి అడుగులు ఉండేవి. అందరివారీగా చలామణి అవుతూ వస్తున్న వారు అధికారంలోకి రాగానే కొందరి వారయ్యారనే అపవాదులు ఎదుర్కొంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత దగ్గరగా ఉన్న ఆ ఇద్దరు ప్రభుత్వంలో కీలకమైన మంత్రులుగా చలామణి అవుతున్నారు. మంత్రులుగా ఎప్పుడైతే వీరు బాధ్యతలు స్వీకరించారో అప్పటినుండి వారి ప్రవర్తనల్లో పెను మార్పులు సంభవిస్తూ వస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.. ప్రధానంగా గోదావరి పరివాహక ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ఇసుక రీచ్ ల నిర్వహణ వీరికి బాగా చెడ్డ పేరు తెచ్చింది. ఆ ఇద్దరి మంత్రుల పేరు వాడుకుంటూ వారి అనుచరులు చేస్తున్న ఆగడాలు ఓవైపు పార్టీకి నష్టం తెస్తుండగా మరోవైపు ప్రజల్లో వారికున్న విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తుంది.

ఇసుక అక్రమాలకు సంబంధించి ప్రత్యక్షంగా వారికి సంబంధాలు ఉన్నాయా..? లేవా..? అనే విషయాలు పక్కన పెడితే వారి పేరును వాడుకొని ఇసుక బినామీలు చేస్తున్న హడావుడి మాత్రం జ(గ)నమెరిగిన సత్యమే.దాన్ని కాదు అనడా నికి ఎక్కడా ఆస్కారం లేదు. గోదావరిని కేంద్రంగా చేసుకొని సాగుతున్న ఇసుక దందా కారణంగా ప్రజల్లో వ్యక్తం అవుతున్న నిరసనలు భవిష్యత్తులో అధికార పార్టీకి నష్టం తెచ్చే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అందరి వారీగా పేరు ఉన్న ఆ ఇద్దరి మంత్రులు ఇసుక మాఫియాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కోవడం చర్చినీయాంశంగా మారుతుంది..

ఒకప్పటి ఉమ్మడి జిల్లాలోని మూడు ఆదివాసీ నియోజకవర్గాల్లో సాగుతున్న ఇసుక రీచ్ ల నిర్వహణ తంతు సహజంగానే అడ్డదారుల్లో సాగుతుంది. ఈ క్రమంలో మంత్రులతో అత్యంత సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ పెద్దలు కొందరు ఇసుక మాఫియా(Sand Mafia) తో జతకట్టి రీచ్ ల మంజూరి కోసం చేసే ప్రయత్నాలు రీచ్ లు వచ్చాక సాగించే అక్రమాల తంతు సహజంగానే ప్రజా వ్యతిరేకతకు అణువుగా మారుతు న్నాయి. అలాంటి పరిస్థితుల్లో మంత్రులకు దగ్గరగా ఉండేవారు ఇసుక మాఫియాకు తోడుగా ఉండడం ఇసుక పంచాయతీలు చేయడం లాంటి చర్యలు ఆ ఇద్దరి మంత్రులకు ఇప్పటికే చెడ్డ పేరును తెచ్చి పెట్టేసాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు.

పత్రికలో వచ్చినందుకు ఏదో తప్పించుకునేందుకు ఖండించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం మంత్రుల పేరుతో సాగుతున్న దందాపై నిరసనలు ఉండనే ఉన్నాయి. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మంత్రులు తమపై వస్తున్న అపవాదులను తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంటిలిజెన్సీ నివేదికలు సైతం మంత్రుల పక్కన ఉన్న పార్టీ పెద్దల తీరు వల్ల భవిష్యత్తులో పార్టీకి నష్టమనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి.

ఈ పరిస్థితుల్లో మంత్రులు స్పందించాల్సిన అవసరం ఉంది. తమకు అత్యంత సన్నిహితంగా ఉండే కాంగ్రెస్ నేతలను ఇసుక జోలికి వెళ్లకుండా కట్టడి చేయాల్సిన ఆవశ్యకత ఉంది ఇసుక పంచాయతీల పేరుతో పబ్లిక్ లో పార్టీకి చెడ్డ పేరు తె స్తున్న వారి పట్ల కఠిన వైఖరిని అవలంబించకుంటే రాబోయే రోజుల్లో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాల్లో అధికార పార్టీకి తిరో గమన ఫలితాలు చవిచూసే పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతకన్నా ముందు అందరివారీగాఉండే ఆ మంత్రులు కేవలం ఇసుక మాఫియా కారణంగా తమ పేరును చెడగొట్టుకోవడం అవసరమా .?అనే ప్రశ్న వేసుకోగలిగితే అనేక అపవాదులకు సమాధానం దొరుకుతుంది. ఓ మంత్రైతే పత్రికల్లో ఏదైనా వార్త వస్తే మీడియాకు వ్యతిరేకంగా కఠిన కక్ష సాధింపు చర్యలకు పాల్పడే పరిస్థితులు పోలీసులను సైతం ఉసిగొల్పే పరిస్థితులు ఏజెన్సీలో నెలకొన్నాయి. అదే మంత్రికి దగ్గరగా ఉన్న అధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒకరు ఉన్నత స్థాయి అధికారులను సైతం తన చెప్పు చేతల్లో తిప్పుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడటం చర్చనీయాంశంగా మారుతుంది.

ఓ డిసిసి అధ్యక్షుని కారణంగా ఒక ప్రముఖ మంత్రి ఉన్న జిల్లాలో ఇప్పటికే 40 శాతం వ్యతిరేకత అధికార పార్టీపై వచ్చిందనే ప్రచారం జరుగుతుంది. ఇసుక అక్రమాల కట్టడానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కఠినమైన చర్యలు తీసుకున్న నేపథ్యంలో ప్రజల్లో ఒక సానుకూలమైన వాతావరణం నెలకొంది ఇదే సందర్భంలో ఆయనకు అత్యంత సన్నిహితంగా ఉండే ఇద్దరు మంత్రులు ఇసుక మాఫియాకు చుట్టాలుగా మారడం ఏజెన్సీ చట్టాలను తుంగలో తొక్కడం లాంటి పరిణామాలు ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పార్టీ ప్రతిష్టను ఇప్పటికే తీసేసాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News