Homeహైదరాబాద్‌Mettu Sai Kumar | అడ్డంకులు తొలగించే ఆది దేవుడు.. గణనాథుడు..

Mettu Sai Kumar | అడ్డంకులు తొలగించే ఆది దేవుడు.. గణనాథుడు..

  • ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలి: మెట్టు సాయికుమార్‌..
  • శాంతినగర్‌ కాలనీ వాసుల ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజలు..

విఘ్నాలను తొలగించే గణనాథుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని తెలంగాణ ఫిషరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌(Mettu Sai Kumar) ఆకాంక్షించారు. గోషామహల్‌ నియోజకవర్గం జాంబాగ్‌ డివిజన్ శాంతినగర్‌ కాలనీ వాసుల ఆహ్వానం మేరకు ఆయన అక్కడికి వెళ్లి వినాయకుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గణనాథుడికి పూజలు నిర్వహించి, ప్రజల సంక్షేమం కోసం ప్రార్థించారు. ప్రతి కుటుంబంలో ఆనందం, ఆరోగ్యం, సుఖశాంతులు నెలకొనాలని, రాష్ట్రంలో ప్రజలంతా సోదరభావంతో ప్రశాంతంగా జీవించాలని కోరుకున్నారు.

- Advertisement -

వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని మెట్టు సాయికుమార్‌(Mettu Sai Kumar) సూచించారు. పండుగ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకున్నారు.

శాంతినగర్‌ కాలనీ వాసులతో మెట్టు సాయికుమార్‌ ఆత్మీయంగా మమేకమై, ఉత్సవాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News