- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- చివరి నిమిషంలో ఆంక్షలు సరికాదు.. భక్తుల మనోభావాలను గౌరవించాలి
- వెంటనే మొండిపట్టు వీడి సమితితో సర్కారు చర్చలు జరపాలి
హైదరాబాద్‌లో వినాయక నిమజ్జన ఏర్పాట్లను ముమ్మరం చేయాలని కోరుతున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి (బీజీయూఎస్) నేతల అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించాల్సిన అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధానికి దిగడం దారుణమన్నారు.
నగరంలో 47 ఏళ్లుగా ఉత్సవాలను, నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించడంలో సమితి కీలకపాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. ఈ ఏడాది 1.40 లక్షల విగ్రహాలు కొలువుదీరాయని, సెప్టెంబరు 25న జరిగే ప్రధాన నిమజ్జనం ఏర్పాట్లపై సర్కారు ముందే స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం అంశాన్ని సమితి ముందుగానే దృష్టికి తెచ్చినా, సరైన సమయంలో ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.Kishan Reddy
చివరి నిమిషంలో ఆంక్షలు విధించడం, అరెస్టులతో అణచివేయాలని చూడటం తగదని హితవు పలికారు. న్యాయపరమైన చిక్కులుంటే ముందుగానే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే తన మొండివైఖరిని వీడి ఉత్సవ సమితితో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా.. భారీ విగ్రహాల నిమజ్జనానికి, ట్రాఫిక్ నిర్వహణకు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలని కోరారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
