Homeరంగారెడ్డిAccident | జవహర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.

Accident | జవహర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.

  • టిప్పర్ ఢీకొని యాక్టివాపై వెళ్తున్న యువతి, యువకుడు దుర్మరణం.

మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వంపుగూడ ఎల్లారెడ్డిగూడెం వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం(Accident) చోటుచేసుకుంది. యాక్టివాపై వెళ్తున్న యువతి, యువకుడిని టిప్పర్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను దీప్సిక (19), అమర్దొయ (15)గా గుర్తించారు.వినాయక మండపం వద్ద అన్నదాన కార్యక్రమానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. టిప్పర్ ఢీకొనడంతో యాక్టివాపై ఉన్న ఇద్దరూ తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News