కొడంగల్ వేదికగా రేవంత్ సర్కార్ వైఫల్యాలపై సమరశంఖం()
- కొడంగల్ గడ్డపై నుంచి ముఖ్యమంత్రికి సవాల్..
- హామీల అమలులో మోసం..
- కుటుంబ పాలన..
- హైకమాండ్ కప్పం రాజకీయాలు..
- రేవంత్‌ను కడిగేసేందుకు కవిత సిద్ధం..
కల్వకుంట్ల కవిత ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్.. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మగా.. ప్రజాసేవలో జాగృతి ద్వారా మమేకం.. తెలంగాణ మహిళల్లో ప్రత్యేక స్తానం.. అత్యున్నత చదువులు, ప్రత్యర్థులకు ఊపిరిసలపని ప్రశ్నలు.. ఎవరితోనైనా సమఉజ్జీగా జవాబులు చెప్పగల సత్తా.. తిరుగులేని వాగ్ధాటి.. చొచ్చుకుపోయే గుణం ఆమెకు సొంతం.. తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని స్థాపించినప్పటి నుండీ.. ఆమె బులెట్ లా దూసుకుపోతూనే ఉంది.. అధికార పక్షం, అలాగే విపక్షంపై తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంది..
బడుగు, బలహీన వర్గాలకు ఒక వెలుగుదివ్వెగా కవిత మారగలదు అనే నమ్మకాన్ని ఆమె కలిగించగలిగింది.. ఎప్పటికప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంది.. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఒక క్రియాశీలక శక్తిగా మారుతుంది అనడంలో అతిశయోక్తి లేదు.. ఈనెల 21 నాడు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ గడ్డపై ఆమె ఒక బహిరంగ సభ నిర్వహించబోతోంది.. ఆ సభలో కవిత(Kalvakuntla Kavitha) ఏం మాట్లాడబోతోంది..? ఏ నిజాలు వెల్లడించబోతోంది..? అధికార, ప్రతిపక్షాలపై ఎలాంటి విమర్శలు చేయబోతోంది అన్నది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతిష్టాత్మక కొడంగల్ గడ్డపైనే తనదైన శైలిలో నిప్పులు చెరిగేందుకు ‘తెలంగాణ రక్షణ సేన’ అధినేత్రి కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) సిద్ధమయ్యారు. ఈనెల 20న నిర్వహించనున్న ఈ బహిరంగ సభను కేవలం ఒక పొలిటికల్ మీటింగ్‌లా కాకుండా, రేవంత్ సర్కార్ అక్రమాలు, వైఫల్యాలపై చార్జిషీట్ విడుదల చేసే వేదికగా మలిచేందుకు ప్లాన్ చేశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోనే ఆయన పాలనా వైఫల్యాలను నిలదీయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెంచాలని వ్యూహం పన్నుతున్నారు..

సభలో కవిత ప్రధానంగా ప్రస్తావించే అస్త్రాలు :
ఆరు గ్యారెంటీలు – అటకెక్కని హామీలు :
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అందకపోవడం. కళ్యాణలక్ష్మి తులం బంగారం, రూ. 2,500 నిరుద్యోగ భృతి, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ అమలులో మోసం.
బంధుప్రీతి / తమ్ముళ్ల దోపిడీ :
ఇన్సెంటీవ్స్, కాంట్రాక్టులు, ల్యాండ్ సెటిల్మెంట్లు, పవర్ కట్/మైనింగ్ మాఫియాలో సీఎం తమ్ముళ్లు, అనుయాయుల వసూళ్ల పర్వంపై కవిత ప్రత్యేక డాక్యుమెంట్లతో నిలదీయ బోతోందని తెలుస్తోంది..
రైతులు, విద్యార్థులు, ఉద్యోగుల వంచన :
ధాన్యం కొనుగోళ్లలో బోనస్ ఎక్కడ? అని నిలదీసే రైతన్నల గొంతు రేవంతా నొక్కుతున్నాడని ఆమె చెప్పదలుచుకుంది.. అలాగే డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో పెండింగ్ స్కాలర్షిప్లు, జాబ్ క్యాలెండర్ లేక నిరుద్యోగ నిరాశ. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపులు, డీఏలు – పీఆర్సీ లేక ఉద్యోగుల వ్యతిరేకత.
ఢిల్లీ హైకమాండ్ ‘కప్పం’ ట్యాక్స్ :
తెలంగాణ వనరులను, రియల్ ఎస్టేట్/లిక్కర్/ట్రాన్స్ఫర్ రెవెన్యూ ను ఏఐసీసీ పెద్దల జేబుల్లోకి చేరవేస్తున్నారనే ఆరోపణలకు ఆన్ – ది – స్పాట్ ఉదాహరణల ప్రస్తావన.
విపక్షాలపై అక్రమ కేసులు, వేధింపులు :
సోషల్ మీడియా కార్యకర్తలు, బీఆరఎస్ శ్రేణులపై అక్రమ కేసులు, థర్డ్ డిగ్రీ అరెస్టులు, వాగ్గ్వాదాల స్వేచ్ఛ అణచివేతపై ఆగ్రహం.
గ్రౌండ్ రియాలిటీ :
అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలు గడుస్తున్నా క్షేత్రస్థాయిలో మార్పు కనిపించకపోవడంతో ప్రజల్లో రేవంత్ సర్కార్ మీద క్రమంగా వ్యతిరేకత మొదలైంది. సొంత ఎమ్మెల్యేగా సీఎం గెలిచినా అభివృద్ధి కంటే కక్షసాధింపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయనే భావన స్థానిక ప్రజల్లో బలపడుతోంది. ఈ సభ ఆ వ్యతిరేకతకు ఒక ఆకృతినివ్వనుంది. రేవంత్ రెడ్డిని ఆయన సొంత నియోజకవర్గంలో కార్నర్ చేయడం ద్వారా ‘నేను ఉన్నాను’ అని తెలంగాణ సమాజానికి భరోసా ఇవ్వడంతో పాటు, కాంగ్రెస్ హైకమాండ్‌కు స్థానిక అసంతృప్తిని నేరుగా తాకించే మాస్టర్ స్ట్రోక్ ఇది అని రాజకీయ మేధావులు భావిస్తున్నారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
