- తలకు తీవ్ర గాయాలు..
- హత్యా? ప్రమాదమా?
- కేసు నమోదు, దర్యాప్తు చేస్తున్న ఎస్సై శ్రీనివాస్ గౌడ్
మండలంలోని శానాయిపల్లి శివారులో రోడ్డుపై ఓ యువకుడి మృతదేహం… తలకు తీవ్ర గాయాలై అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు(Suspicious Death Case). ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపల్లి గ్రామానికి చెందిన గుడ్డింగారి రాజు (25) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పని ఉందని ఇంటి నుంచి వెళ్లిన రాజు.. అదే రోజు రాత్రి శానాయిపల్లి శివారులో రోడ్డుపై తలకు గాయాలతో పడి కనిపించాడు. స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని పరిశీలించారు. రాజును ఎవరైనా హత్య చేశారా? లేక వాహనం ఢీకొని మృతిచెందాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సిద్ధిరాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
