Homeకెరీర్ న్యూస్SSC CHSL | ఉద్యోగావకాశాలు..

SSC CHSL | ఉద్యోగావకాశాలు..

  • నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ ఎస్ సి..
  • 2536 ఖాళీల భర్తీకి సిద్ధం..

స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఉద్యోగ నియామక సంస్థ. ఈ సంస్థ కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ – 2026(SSC CHSL) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 2536 ఖాళీలను భర్తీ చేయనుంది. వీటిని వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలు, ట్రిబ్యునళ్లు, ఇతర వాటిలో నింపనున్నారు. ఇంటర్‌ పాసైనవారినుంచి దరఖాస్తులను కోరుతుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయ్యింది. అక్టోబర్‌ 7 వరకు కొనసాగుతుంది.

పోస్టులు :
లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ /జూనియర్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌..
డేటా ఎంట్రీ ఆపరేటర్‌..
గ్రేడ్‌ ‘ఎ’ డేటా ఎంట్రీ ఆపరేటర్‌
పై పోస్టుల్లో ఈ 2536 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

- Advertisement -

అర్హతలు :
మినిస్ట్రీ ఆఫ్‌ కన్జ్యూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రబ్యూషన్‌, SSC, మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌లోని డీఈవో/డీఈవో గ్రేడ్‌ ‘ఎ’ పోస్టులకు మ్యాథమెటిక్స్‌ ఒక సబ్జెక్టుగా సైన్స్‌ విభాగంలో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు కావాలి. మిగతా డిపార్ట్‌మెంట్‌, మినిస్ట్రీల్లోని ఎల్‌డీసీ/జేఎస్‌ఏ, డీఈవో/డీఈవో గ్రేడ్‌ ‘ఎ’ పోస్టులకు ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు పాసై ఉండాలి.

వయసు :
ఈ ఏడాది అక్టోబర్‌ 1 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి. 1999, ఆగస్టు 2 నుంచి 2008, ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులకు 15 ఏండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

దరఖాస్తు :
అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ. 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News