Homeస్పోర్ట్స్Elena Rybakina | మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ఎలినా రిబాకినా..

Elena Rybakina | మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ఎలినా రిబాకినా..

  • శనివారం జరిగే ఫైనల్లో ఆరినతో పోటీ..
  • నెంబర్ వన్ రాంక్ లో కొనసాగుతున్న సబలెంకా..

యూఎస్ ఓపెన్ టెన్నిస్ మ‌హిళ‌ల సింగిల్స్ ఫైన‌ల్లోకి ఎలినా రిబ‌కినా(Elena Rybakina) ప్ర‌వేశించింది. కోకో గాఫ్‌తో జ‌రిగిన సెమీస్‌లో రిబ‌కినా అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇక శ‌నివారం జ‌రిగే ఫైన‌ల్లో టాప్ సీడ్ అరినా స‌బ‌లెంకాతో ఆమె త‌ల‌ప‌డ‌నున్న‌ది. ఫైన‌ల్లో ఇద్ద‌రు టాప్ సీడ్లు పోటీప‌డ‌డం మ్యాచ్‌లో ఉత్కంఠ రేప‌నున్న‌ది. 99 వారాల నుంచి స‌బ‌లెంకా వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌లో కొన‌సాగుతున్న‌ది. రెండో ర్యాంక్‌లో ఉన్న క‌జ‌కిస్థాన్ ప్లేయ‌ర్ రిబ‌కినా.. ఫైన‌ల్లో త‌న స‌త్తా ప్ర‌ద‌ర్శిస్తేనే టాప్ ర్యాంక్ ఆమె సాధ్య‌మ‌వుతుంది. స‌బలెంకా వరుస‌గా మూడోసారి యూఎస్ ఓపెన్ మ‌హిళ‌ల టైటిల్‌పై క‌న్నేసింది.(https://epaper.aadabhyderabad.in/)

హ్యాట్రిక్‌పై క‌న్నేసిన‌ స‌బ‌లెంకా సెమీస్‌లో 7-5 6-2 స్కోరుతో అమెరిక‌న్ ప్లేయ‌ర్ జెస్సికా పెగులాపై గెలుపొందింది. మ‌రో వైపు రిబ‌కినా సెమీస్‌లో 3-6 6-4 6-4 స్కోరుతో గాఫ్‌పై విజ‌యం సాధ‌ఙంచింది. అయితే ఇద్ద‌రు టాప్ సీడ్లు ఫైన‌ల్లోకి ప్ర‌వేశించ‌డం ఆస‌క్తి పెంచుతోంది. 2013 త‌ర్వాత యూఎస్ ఓపెన్ ఫైన‌ల్లో ఇద్ద‌రు టాప్ సీడ్లు పోటీప‌డ‌డం మొద‌టిసారి అవుతంది. 2013లో సెరీనా విలియ‌మ్స్‌, విక్టోరియా అజ‌రెంకా ఫైన‌ల్లో త‌ల‌ప‌డ్డారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News