Homeబిజినెస్Consumer Protection Rules | రక్షణ నిబంధనలు 2020 సవరణ..

Consumer Protection Rules | రక్షణ నిబంధనలు 2020 సవరణ..

  • ధరలో పారదర్శకత..
  • డార్క్ ప్యాటర్న్స్ కట్టడి..

కేంద్ర ప్రభుత్వం ఈ-కామర్స్‌ వినియోగదారుల రక్షణ నిబంధనలు-2020ని(Consumer Protection Rules) సవరించింది. ధరల్లో పారదర్శకత దగ్గర్నుంచి డార్క్‌ ప్యాటర్న్స్‌ కట్టడిదాకా అన్ని రూల్స్‌ను కఠినతరం చేసినట్టు గురువారం వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలియజేసింది. ఈ క్రమంలోనే నూతన కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ (ఈ-కామర్స్‌) అమెండ్‌మెంట్‌ రూల్స్‌-2026 వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయని ఓ ప్రకటనలో తెలిపింది. https://epaper.aadabhyderabad.in/

నానాటికీ ఆన్‌లైన్‌ షాపింగ్‌ విస్తృతమవుతున్న నేపథ్యంలో అమాయక కస్టమర్లను కేటుగాళ్లు నిండా ముంచుతున్న విషయం తెలిసిందే. అధిక ధరలు వసూలు చేయడం, నాసిరకం వస్తూత్పత్తులను అంటగట్టడం, ఒకటి చూపించి మరొకటి పంపడం, రిటర్న్‌-రిఫండ్‌కు ఇబ్బందులు పెట్టడం వంటివి తరచూ చూస్తూనే ఉన్నాం. దీంతోనే వినియోగదారుల రక్షణార్థం కొత్త రూల్స్‌ను తెచ్చామని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News