Homeకరీంనగర్Chakali Ailamma | చాకలి ఐలమ్మ విగ్రహం పక్కనే వైన్‌షాప్‌.. ఇదేం పరిస్థితి?

Chakali Ailamma | చాకలి ఐలమ్మ విగ్రహం పక్కనే వైన్‌షాప్‌.. ఇదేం పరిస్థితి?

  • మహనీయులకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా అంటున్న పట్టణ ప్రజలు
  • విగ్రహం పరిసరాల్లో మద్యం దుకాణంపై స్థానికుల అభ్యంతరం.. అధికారులు స్పందించాలంటూ డిమాండ్

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మను(Chakali Ailamma) వర్ధంతి సందర్బంగా నాయకులు, ప్రజలు స్మరించుకుంటూ ఏర్పాటు చేసిన విగ్రహం పక్కనే వైన్‌షాప్‌ ఉండటంపై స్థానికంగా చర్చ మొదలైంది. మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతాలను గౌరవప్రదంగా, పరిశుభ్రంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

చాకలి ఐలమ్మ(Chakali Ailamma) తెలంగాణ ప్రజల హక్కుల కోసం పోరాడిన ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచారు. అలాంటి మహనీయురాలి విగ్రహం సమీపంలో మద్యం విక్రయ కేంద్రం ఉండటం సముచితమేనా? అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. విగ్రహం పరిసర ప్రాంతం ప్రజలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలని, అక్కడ మద్యం దుకాణం వల్ల అసౌకర్యం కలిగే పరిస్థితులు ఉన్నాయని అధికారులు దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.(epaper.aadabhyderabad.in)

- Advertisement -

అలాగే అధికారులు పరిశీలించి వైన్‌షాప్‌ ను ఆ ప్రదేశంలో ఉన్న వైన్ షాప్ సంబంధిత ఎక్సైజ్ అధికారులు దృష్టి సారించి వేరే ప్రదేశంలోకి మార్చాలని స్థానికులు కోరుతున్నారు. అలాగే మున్సిపల్ అధికారులు కూడా విగ్రహం చుట్టుపక్కల పరిస్థితులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News