Homeనల్లగొండYSR | బడుగు బలహీన వర్గాల సంక్షేమ నాయకుడు వైఎస్సార్…

YSR | బడుగు బలహీన వర్గాల సంక్షేమ నాయకుడు వైఎస్సార్…

  • సర్పంచ్ కొదమగుండ్ల నగేష్…

బడుగు బలహీన వర్గాల సంక్షేమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని గ్రామ సర్పంచ్ కొదమగుండ్ల నగేష్ అన్నారు. బుధవారం చివ్వెంల మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామంలో గతంలో పిట్టా రాంరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వైయస్సార్ విగ్రహానికి ఆయన 17 వర్ధంతి సందర్భంగా పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన మాట్లాడారు.

ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప జనహృదయనేతని కొనియాడారు. ఆరోగ్యశ్రీ లాంటి పథకం ద్వారా ఎందరో పేదలకు ఉచిత వైద్య సేవలు అందించిన మహా గొప్ప నాయకుడని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పిట్ట వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నూరు నరసింహ చారి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దుబ్బాక ప్రభాకర్ రెడ్డి, రాఘవరెడ్డి, జూలకంటి గోపిరెడ్డి, సైదులు, సోమిరెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News