జీవితం అంటే.. జయాల పరంపర కాదు..
ఓటముల ఒడిలోనూ ఆశలను నిలబెట్టుకోవడం!
కన్నీటి చుక్కలు కళ్లను తడిపినా..
కలల వెలుగులు మాత్రం
మనసును విడిచిపోవు..!
పడిపోయిన ప్రతిసారీ పరాజయం అనుకోవద్దు..
లేచి నిలబడిన క్షణమే గెలుపుకు తొలి అడుగు..!
కాలం కఠినంగా ఉన్నా..
గమ్యం దూరంగా కనిపించినా..
నమ్మకం అనే దీపాన్ని ఆరిపోనివ్వకు..!
నిన్ను నువ్వు నమ్మితే నడిచే దారే మారుతుంది..
ఒక్క అడుగు ధైర్యంగా వేస్తే వేల అడుగులు తోడవుతాయి..!
కష్టాలే శాశ్వతం కావు..
కన్నీళ్లే చివరి మాట కావు..
చీకటి తర్వాత వెలుగులా బ్రతుకులోనూ
కొత్త ఉదయం తప్పదు..!
ఆశను వదలకు..ప్రయత్నాన్ని ఆపకు..
నీ గెలుపు కోసం కాలమే ఎదురుచూస్తుంది..!
- మామిడి ఇంద్రారెడ్డి.
- Advertisement -
