Homeనిజామాబాద్‌Tadwai | ఘనంగా రాజ బహుదూర్ వెంకటరెడ్డి జయంతి వేడుకలు..

Tadwai | ఘనంగా రాజ బహుదూర్ వెంకటరెడ్డి జయంతి వేడుకలు..

  • రాజా బహుదూర్ చేసిన సేవలు మరువలేనివి.
  • ఆయన అడుగుజాడల్లో నడవాలి.
  • తాడ్వాయి మండల రెడ్డి సంఘం సభ్యులు..

రాజా బహుదూర్ వెంకట్ రెడ్డి 157 వ జయంతి వేడుకలను శనివారం తాడ్వాయి మండలం రెడ్డి సంఘం సభ్యులు మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పొందుటూరు నవీన్ రెడ్డి మాట్లాడుతూ రాజా బహుదూర్ వెంకటరెడ్డి, 1886 తన 18ఏటాలో అప్పటి నిజాం నవాబుల కాలంలో ఒక సాధారణ అమీన్ గా తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, హైదరాబాద్ నగర మొదటి హిందూ కొత్వాల్ గా( పోలీస్ కమిషనర్) ఎదిగిన వ్యక్తి రాజ బహుదూర్ వెంకట్ రెడ్డి అన్నారు. ఆయన ఒక సంఘసంస్కర్తగా, హైదరాబాదులో రెడ్డి హాస్టల్ నిర్మాణం చేపట్టి, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే పేద విద్యార్థులు చదువుకోవడానికి హైదరాబాద్ లో ఉచితంగా వసతి కల్పించడమే కాకుండా,మహిళల విద్య కోసం నారాయణగూడ లో ఆంధ్ర బాలికోన్నత పాఠశాల ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించాడన్నారు.

అనంతరం రెడ్డి సంఘం క్యాషియర్ దేమి రాజిరెడ్డి మాట్లాడుతూ నిజాం ప్రభువుల నుండి “రాజా బహుదూర్ “అనే బిరుదులు పొందిన మొదటి హిందూ గా ఆయన చరిత్ర పుటల్లో నిలిచారు. సురవర ప్రతాప్ రెడ్డి తో కలిసి “గోల్కొండ పత్రిక “స్థాపన కోసం ఆయన కృషి చేశారన్నారు.అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయనకు “ఆర్డర్ ఆఫ్ ది ఆఫీసర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్” అనే గౌరవాన్ని ప్రధానం చేసింది. కుల మతాలకతీతంగా అనాధాశ్రమకు,కుష్టి వ్యాధి నివారణ సంస్థలకు, జంతు సంరక్షణ శాలలకు,ఆయన భారీగా విరాళాలు అందించేవారు.

- Advertisement -

రాజా బహదూర్ వెంకట రెడ్డి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రెడ్డి సంఘం సభ్యులు ముందుకు సాగాలని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండలం రెడ్డి సంఘం అధ్యక్షుడు పొద్దుటూరి, నవీన్ రెడ్డి జిల్లా కార్యదర్శి ఏనుగు ,మోహన్‌రెడ్డి, జిల్లా రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి ,ప్రతాప్‌రెడ్డి, రెడ్డి సంఘాల జిల్లా ప్రచార కార్యదర్శి, కందడి, ప్రవీణ్‌రెడ్డి తాడ్వాయి మండలం రెడ్డి సంఘం కార్యదర్శి, పులగం, రవీందర్ రెడ్డి, క్యాషియర్ దేమో, రాజిరెడ్డి , మండల ఉపాధ్యక్షులు ఏనుగు, రమేష్ రెడ్డి ప్రధాన కార్యదర్శి , నరేందర్ రెడ్డి , మండల సంఘ సభ్యులు నిమ్మల రాజు , సుధాకర్ రెడ్డి , సిద్ధిరామరెడ్డి, రాజిరెడ్డి , నారాయణరెడ్డి, చిన్న గంగారెడ్డి , వివిధ గ్రామాల రెడ్డి సంఘ సభ్యులు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News