Homeఆదాబ్ ప్రత్యేకంIllegal Mining | లంచాల మైకంలో మైనింగ్ శాఖ..!

Illegal Mining | లంచాల మైకంలో మైనింగ్ శాఖ..!

  • రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో రాత్రి పూట మైనింగ్ మాఫియా జోరు
  • లీజులు ముగిసి రెండు మూడేళ్లయినా యథేచ్ఛగా కొనసాగుతున్న తవ్వకాలు..
  • ప్రభుత్వానికి ఖజానాకు సుమారు రూ.100 కోట్ల నష్టం?
  • మైనింగ్ ఏడి నర్సిరెడ్డి పర్యవేక్షణలోనే వ్యవహారం నడుస్తోందా..?
  • రాత్రి వేళల్లో యథేచ్ఛగా వందలాది టిప్పర్ల రాక పోకలు..
  • చుట్టుపక్కల ప్రాంతాలకు తప్పని తిప్పలు..
  • సంబంధిత ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలి..

రంగారెడ్డి జిల్లా పరిధిలోని స్టోన్ క్రషర్ల నిర్వహణపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతు న్నాయి. కడ్తాల్ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 468లో ఆపెక్స్ ఇన్‌ఫ్రాటెక్(Apex Infratec) స్టోన్ క్రషర్‌తో పాటు కర్కల్ పహాడ్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 6లో ఎండీఆర్ స్టోన్ క్రషర్ల వద్ద రాత్రి వేళల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు చర్చనీ యాంశంగా మారాయి. లీజుల గడువు ముగిసి రెండుమూడేళ్లు గడిచినా సంబంధిత క్రషర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆదాబ్ హైదరాబాద్ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా 02 సెప్టెంబర్ 2026 రోజున రెవెన్యూ, మైనింగ్ అధికారులు అట్టి కంపెనీలను సీజ్ చేసి వెళ్లారు. అయినా కూడ మైనింగ్ మైనింగ్(Illegal Mining) యాజమాన్యం రాత్రిపూట క్వారీ తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి రావలసిన ఆదాయంలో సుమారు రూ.100 కోట్ల మేర నష్టం వాటిల్లిందనే ఆరోపణల నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

రాత్రివేళల్లో వందలాది టిప్పర్ల రాకపోకలు..? : క్వారీల నుంచి రాత్రివేళల్లో వందలాది టిప్పర్ల ద్వారా రాళ్లను తరలిస్తూ లోడింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఆయా క్రషర్లు, క్వారీలకు ఉన్న అనుమతులు, లీజుల గడువు, ఖనిజ తవ్వకాల పరిమితులు, రవాణా పత్రాలు, రాయల్టీ చెల్లిం పుల వివరాలను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని స్థాని కులు కోరుతున్నారు. అనుమతులకు విరుద్ధంగా కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు తేలితే సంబంధిత నిర్వాహకులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

లీజులు ముగిసినా తవ్వకాలు..? : లీజుల గడువు ముగిసిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగుతున్నాయా? కొనసాగితే ఏ అనుమతుల ఆధారంగా నిర్వహిస్తున్నారు? సంబంధిత శాఖలు తనిఖీలు చేపట్టాయా? నిబంధనల ఉల్లంఘనలు గుర్తించినప్పటికీ చర్యలు తీసుకోలేదా? అనే ప్రశ్నలు స్థానికుల నుంచి వ్యక్తమవుతున్నాయి. లీజుల వివరాలు, గడువు ముగిసిన తేదీలు, రెన్యువల్ అనుమతులు, ఉత్పత్తి-రవాణా లెక్కలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మైనింగ్ శాఖ పర్యవేక్షణపై అనుమానాలు : మైనింగ్ ఏడి నర్సి రెడ్డి పర్యవేక్షణలోనే ఈ వ్యవహారం సాగుతోందంటూ ఆరోపణ లు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో మైనింగ్‌శాఖ పర్యవేక్షణ, తని ఖీల తీరుపై ప్రశ్నలుతలెత్తుతున్నాయి.ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరిగిందనే ఆరోపణలపై సంబంధిత అధికారులు రికార్డులను పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ ఆదాయానికి రూ.100 కోట్ల గండి..? : అక్రమ తవ్వకాలు, అనుమతులకు విరుద్ధంగా ఖనిజాల రవాణా లేదా రాయల్టీ చెల్లింపుల్లో అవకతవకలు జరిగినట్లయితే ప్రభుత్వ ఖజా నాకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సుమారు రూ.100 కోట్ల నష్టం జరిగిందనే ఆరోపణలకు ఆధారాలేమిటి? వాస్తవంగా ఎంతమేర ఆదాయ నష్టం జరిగింది? అనే అంశాలపై అధికారిక విచారణ జరగాల్సి ఉంది. సంబంధిత లీజులు, రాయల్టీ రికార్డులు, రవాణా వివరాలు, తనిఖీ నివేదికలను పరిశీలించి స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

ఆరోపణల నేపథ్యంలో చర్చనీయాంశం అవుతున్న మరో కథనం : మైనింగ్ శాఖపై(Illegal Mining) ఆరోపణలు వెల్లువెత్తుతున్న సమయంలో ఏడి నర్సిరెడ్డికి అనుకూలంగా ఓ ప్రధాన పత్రికలో కథనం ప్రచురించారు. ఇట్టి వార్తాపత్రిక కథనం చూపించి పై స్థాయి అధికారులకు నివేదికలు సమర్పించి వారి మెప్పు పొందాలనీ, ఈ వ్యవహారంలో తనకేమి తెలియనట్లు వ్యవహరిస్తున్నాడు. ఆరోపణ లకు సంబంధించి వాస్తవాలను ప్రజల ముందుంచడంతో పాటు,సంబంధిత శాఖలు స్వతంత్రంగా విచారణ జరిపి పారదర్శకతను నిరూపించాలని స్థానికులు కోరుతున్నారు.

అధికారులకు లేఖలు ఇచ్చాం : మైనింగ్ ఏడి నర్సిరెడ్డి.. స్టోన్ క్రషర్ల నిర్వహణ, రాత్రివేళల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న ఆరోపణలపై మైనింగ్ ఏడి నర్సిరెడ్డిని వివరణ కోరగా, ఈ విషయంపై తాను ఇంత కుముందే రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికా రులతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.

రాత్రివేళల్లో జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై సంబంధిత శాఖల అధికారులకు ఇప్పటికే లేఖలు జారీ చేసినట్లు వివరించారు.

ఉన్నతాధికారులు స్పందించేనా..? : మైనింగ్ శాఖ అధికారుల వివరణతో పాటు సంబంధిత శాఖల రికార్డులను పరిశీలించి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. రంగారెడ్డి జిల్లాలోని కడ్తాల్, కర్కల్ పహాడ్ రెవెన్యూ పరిధుల్లోని స్టోన్ క్రషర్లు, క్వారీలపై సంయుక్త తనిఖీలు నిర్వహించి, లీజుల గడువు, అనుమతులు, రాయల్టీ చెల్లింపులు, రాత్రివేళల రవాణా వివరాలను పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News