HomeజాతీయంUdhayanidhi | ఉచితంగా ఎమ్మెల్యేలకు కార్లు ఇవ్వొద్దు..

Udhayanidhi | ఉచితంగా ఎమ్మెల్యేలకు కార్లు ఇవ్వొద్దు..

  • డిమాండ్ చేసిన ఉదయనిధి స్టాలిన్..
  • రాష్ట్రం అసలే అప్పుల్లో వుంది.. ఆలోచించాలి.

తమిళనాడులో అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే మధ్య వాహనాల కేటాయింపు వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ ప్రభుత్వ ఖర్చుతో కార్లు అందజేస్తామని ముఖ్యమంత్రి విజయ్ చేసిన ప్రకటనను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ప్రతిపాదనను తమ పార్టీ తిరస్కరిస్తున్నట్లు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.

శుక్రవారం అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి విజయ్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 234 మంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గ పనుల నిమిత్తం ప్రభుత్వ వాహనాలు సమకూర్చుతామని ప్రకటించారు. వీటితో పాటు డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ. 75,000 అలవెన్స్ కూడా మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఆర్థిక నేపథ్యం లేని కొత్త ఎమ్మెల్యేలకు ఇది ఎంతో ఊరటనిస్తుందని, పారదర్శకమైన, అవినీతిరహిత పాలనకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

- Advertisement -

అయితే, ప్రభుత్వ నిర్ణయంపై డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రం అప్పుల్లో ఉందని పదేపదే చెబుతున్న టీవీకే ప్రభుత్వం, ఇప్పుడు ఎమ్మెల్యేలకు కార్లు పంపిణీ చేయడమేమిటని ఉదయనిధి స్టాలిన్ ప్రశ్నించారు. తమ పార్టీకి చెందిన 59 మంది ఎమ్మెల్యేలు ఈ కార్లను తీసుకోబోరని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించి, సొంత వాహనాలు లేని వారికి మాత్రమే ఈ సౌకర్యం కల్పించాలని ఆయన సూచించారు.

డీఎంకే విమర్శలపై మంత్రి ఆధవ్ అర్జున ఘాటుగా స్పందించారు. ఈ పథకం కింద సొంతంగా కారు లేని ఎమ్మెల్యేలకు మాత్రమే వాహనాలు కేటాయిస్తామని ఆయన స్పష్టతనిచ్చారు. ఇది విలాసం కాదని, ప్రజాసేవకు అవసరమైన కనీస సదుపాయమని వ్యాఖ్యానించారు. అనేక బంగ్లాలు ఉన్నప్పటికీ ఉదయనిధి స్టాలిన్ ప్రభుత్వ క్వార్టర్స్‌లో ఎందుకు నివసిస్తున్నారని ఆయన నిలదీశారు. ముఖ్యంగా చిన్న పార్టీల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలకు ఈ వాహనాలు ఎంతో అవసరమని ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News