Homeఆదిలాబాద్Protest | శక్తి స్కీం, జీవో 97ను వెంటనే రద్దు చేయాలి..

Protest | శక్తి స్కీం, జీవో 97ను వెంటనే రద్దు చేయాలి..

  • నిర్మల్ లో తరగతులు బహిష్కరించి ఆందోళన చేసిన పాలిటెక్నిక్ విద్యార్థులు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి స్కీం, జీవో 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు గురువారం ఆందోళన చేపట్టారు తరగతులు బహిష్కరించి ప్రధాన ద్వారం మీద బైఠాయించారు. శక్తి స్కీం, జీవో97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను కాపాడాలి అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పాలిటెక్నిక్ విద్యను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేయడం వల్ల విద్యార్థుల మూడేళ్ల విద్యా వ్యవస్థ దెబ్బతింటుందని అన్నారు. ఈ నిర్ణయం వల్ల భవిష్యత్తులో వేలాది మంది విద్యార్థుల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం కొత్త స్కీం పేరుతో ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే శక్తి స్కీం, జీవో 97ను రద్దు చేసి పాలిటెక్నిక్ కళాశాలలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News