Homeసాహిత్యంHealthy Habits | నేదునూరి పిలుపు

Healthy Habits | నేదునూరి పిలుపు

అలవాట్లే ఆరోగ్యానికి
పునాదులు

మన ఆరోగ్యం మన
చేతుల్లోనే ఉంటుంది
ఆరోగ్యకరమైన జీవితం
కోసం ఖరీదైన సప్లిమెంట్లు
వినియోగించ వద్దు

- Advertisement -

రోజు తగినంతనిద్రపోవడం
బ్రహ్మ ముహూర్తాన మేల్కొవడం
ఉదయం నడక రెగ్యులర్
వ్యాయామం యోగా ధ్యానం
సమతుల ఆహారం
స్నేహితులతో గడపడం
సమాజ సేవలో పాల్గొనడం

ఉదయాన్నే వేసే ప్రతి
అడుగు ఆరోగ్యానికి వరం
నడకతో సాగాలి ఆరోగ్య
ప్రయాణం
జనంతో కలిసి నడవాలి
మనసులో బాధలు షేర్ చేసుకోవాలి
షేరింగ్ కేరింగ్ డేరింగ్
డైనమిజం మన జీవన శైలి
కావాలి
జనమే మనమనే దృక్పథంతో
అందరిలో కలిసిపోవాలి
కండరాల కదలిక లే దేహానికి బలం

మనసు ప్రశాంత కు ధ్యానం
ఆందోళనల అలజడిని
అణిచి వేసే ఏకాగ్రత
పెదవులపై విరిసే నవ్వే
ఒక సంజీవని
కష్టాల భారాన్ని కరిగించే
అమృత వాణి

ఒంటరి తనం చీకట్లను
తుడిచే స్నేహం కావాలి
సోషల్ కౌన్సెలింగ్
తోనే లభించు ఉపశమనం
మంచి అలవాట్లే ఆరోగ్యానికి
శ్రీరామరక్ష దేహమే దేవాలయం
మానవ సేవే మాధవ సేవా
మన జీవన తంత్రం కావాలి

ఆరోగ్యభరతాన్ని నిర్మించే
మహా యజ్ఞంలో క్రియా శీలక
భాగస్వాముల మైదాం
సంపాదించిన ధనం వస్తువులు
ఆస్తులు రావు వెంట అనే
సూక్తిని పాటిద్దాం

ఆరోగ్యకరమైన అలవాట్లే
అసలైన సంపద
మన అలవాట్లే ఆరోగ్యానికి
నిజమైన పునాది

క్రమశిక్షణ నీతి నిజాయితీ
పరోపకారం చిన్న చిన్న
అలవాట్లే పెద్ద మార్పులకు
దారి చూపుతాయి

సంపదలు మారవచ్చు
పదవులు ముగియవచ్చు
కానీ ఆరోగ్యకరమైన
అలవాట్లతోసాధించిన
శారీరక మానసిక
దృఢత్వమే మనిషికి
జీవితాంతం తోడుండే
నిజమైన ఆస్తి
నేటి అలవాటే
రేపటి మన ఆరోగ్య
భాగ్యానికి నాందికావాలి

ఔషధాలు అవసరంలేని
ఆనందమయమైన జీవితం
కావాలంటే అలవాట్లను
మార్చుకుందాం
ఆరోగ్య భారత్ నిర్మిద్దాం

- Advertisement -
RELATED ARTICLES

Latest News