Homeనిజామాబాద్‌అణగారిన వర్గాల ఆకలి తీర్చిన పండుగ సాయన్న చేసిన సేవలు మరువలేనివి.

అణగారిన వర్గాల ఆకలి తీర్చిన పండుగ సాయన్న చేసిన సేవలు మరువలేనివి.

  • ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పంబల్ల యాదగిరి.

అణగారిన వర్గాల ఆకలి తీర్చిన గొప్ప వ్యక్తి” తెలంగాణ రాబిన్ హుడ్” పండుగ సాయన్న చేసిన సేవలు మరువలేవని తాడ్వాయి మండలం ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పంబల్ల యాదగిరి అన్నారు. ఆయన శనివారం తాడ్వాయి మండల కేంద్రంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను సంఘం సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాబిన్ హుడ్ గా పిలవబడే పండుగ సాయన్న నిజాం నిరంకుశ పాలన కు వ్యతిరేకంగా అణగారిన వర్గాల ఆకలి తీర్చేందుకు ఆనాడు నిజం ప్రభువుల ధాన్యం కారాగాన్ని కొలగొట్టి వాటిని పేదలకు పంచి పెట్టేవాడు అన్నారు.

ధనవంతుల నుండి, పెట్టు బడుదారుల వ్యవస్థనుండి భూస్వాముల నుండి, అణగారిన వర్గాలను అణిచివేతకు గురి కాకుండా వారిపై తిరుగుబాటు చేశాడన్నారు.తెలంగాణ ప్రాంత వాసిగా మహబూబ్నగర్ జిల్లాలో పుట్టిన పండుగ సాయన్న నిజాం పాలన పై అలుపెరుగని పోరాటం చేశాడని ఆయన చిన్నప్పటి నుండే పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పంబల యాదగిరి, ఉపాధ్యక్షులు గుడికాడ రాజు, సెక్రటరీ పని పవన్, క్యాషర్ పంబల పండరి, సలహాదారులు పని చిన్న రాజయ్య, పంబల లక్ష్మణ్, పని సాయన్న, పంబల సదాశివుడు,పంబల్ల సతీష్ తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News