Homeనల్లగొండAITUC | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

AITUC | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

  • ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి…

మఠంపల్లి మండల కేంద్రంలో గురువారం ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం మండల మహాసభ ఎర్రవెల్లి శాంతకుమారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.మధ్యాహ్న భోజన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,వారి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్నో పోరాటాల ఫలితంగానే ప్రస్తుతం రూ.3,000 గౌరవ వేతనం లభిస్తున్నప్పటికీ అది చాలీచాలని పరిస్థితి ఉందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వంట కార్మికులకు రూ.10 వేల వేతనం అందిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు.అదే విధంగా మధ్యాహ్న భోజన కార్మికులకు బీమా సౌకర్యం కల్పించి భద్రత కల్పించాలని, బడి పిల్లలకు భోజనం వండేందుకు అప్పులు చేసి సరుకులు కొనుగోలు చేస్తున్నప్పటికీ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -

కోడిగుడ్లు,నిత్యావసర సరుకులు,గ్యాస్‌ను ప్రభుత్వమే నేరుగా సరఫరా చేయాలని,ప్రతి విద్యార్థికి మంజూరు చేసే మెనూ చార్జీలను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి సయ్యద్ రన్ మియా, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం నాయకులు ఎర్రవెల్లి శాంతకుమారి, భూక్య ముత్యాలు,కాటేపల్లి పుష్ప, పాశం భద్రమ్మ,సత్తర్పు వెంకటేశ్వర్లు, మంగమ్మ, కె.సాలమ్మ, రాజ్యలక్ష్మి, ఎం. పద్మ,ఎం. రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News