- కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.
- పుట్టిన బిడ్డకు ముర్రుపాలు తాగించాలి. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్.
ప్రతి బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరమని పుట్టిన గంటలో బిడ్డకు ముర్రిపాలు తాగించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. ఆయన గురువారం తాడ్వాయి మండలంలోని ఎర్రపహడ్ పీహెచ్సీని ఆసుపత్రిని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా హాస్పటల్లో ఉన్న మందుల స్టాకును, బెడ్ లను పరిశీలించారు. అనంతరం మండల వైద్యాధికారి ఖాసింతో మాట్లాడుతూ హాస్పిటల్లో పనిచేసే ప్రతి సిబ్బంది సమయపాలన పాటించాలని హాస్పిటల్ కి వచ్చే రోగులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని, రోగులకు కావాల్సిన వైద్యం సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని డెలివరీలు అయ్యేవిధంగా చూడాలన్నారు.
అనంతరం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని ఓ చిన్నారికి అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లితో మాట్లాడుతూ పుట్టిన గంటలోపే తల్లి నుండి ముర్రుపాలు బిడ్డకు తాగించాలని ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు ఇవ్వడం తప్పనిసరి అన్నారు. భవిష్యత్తులో బిడ్డకు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే తల్లిపాలే శ్రేయస్కరమని తల్లిపాలు తాగడం వల్ల బిడ్డ రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి ఖాసిం, సూపర్డెంట్ నారాయణ, వైద్య సిబ్బంది,,ఆశా వర్కర్లు పాల్గొన్నారు
