- గబ్బిలన్నపేటలో పగిలిన డ్రైనేజీ మూతతో ప్రమాదం పొంచి ఉంది
జవహర్ నగర్ గ్రేటర్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని గబ్బిలన్నపేట ప్రాంతంలో డ్రైనేజీ మూత పగిలిపోవడంతో ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీగా ఉండే ఈ మార్గంలో చిన్నపిల్లలు, వృద్ధులు ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనకు గురవుతున్నారు.
పగిలిన డ్రైనేజీ మూత కారణంగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో ప్రయాణించే వారికి ప్రమాదం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు.
ఇప్పటికైనా సంబంధిత మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి పగిలిన డ్రైనేజీ మూతను మార్చి, ప్రమాదాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందస్తు చర్యలు తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని వారు కోరుతున్నారు.
