- తల్లిపాలు శిశువుకు సంపూర్ణ ఆహారం
మంచిర్యాల జిల్లా లక్షేటిపేట్ బస్తీ దవాఖాన లో హాజరైన బాలింతలకు, గర్భిణీ లకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపిడిఓ మధుసూదన్ ఈ సందర్భంగా ఎంపిడీఓ మాట్లాడుతూ తల్లి పాలు శిశువుకు సంపూర్ణ ఆహారం అని ఇవి వారికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తాయి మరియు రోగనిరోధక శక్తిని పెంపొందించి, అనేక అనారోగ్యాల నుంచి రక్షిస్తాయి. తల్లిపాల వల్ల తల్లికి, బిడ్డకు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అంతేకాదు, ఇది తల్లిబిడ్డల మధ్య ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుతుంది. అలాగే పిల్లల బరువులు ప్రతి నెల తూచి వారి బరువులు, ఎత్తు ప్రతి తల్లి తెలుసుకోవాలి అని వివరించారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్ వైజర్ మమత, ఎంపిడిఓ మధుసూదన్ RBSK డాక్టర్ శోభారాణి, ఫార్మసిస్ట్ అజయ్ కుమార్, Anm సుజాత, నాగ ప్రమీల ,అంగన్వాడీ టీచర్స్ లక్ష్మీ, శంకరమ్మ, ఆశా రాజేశ్వరి, లలిత, రాజమణి,ఆయా, తల్లులు, పిల్లలు కిశోర బాలికలు పాల్గొన్నారు.
