- కామారెడ్డి డీఈవో మల్లికార్జున్ .
పదో తరగతి విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యా బోధన చేయాలని కామారెడ్డి డీఈవో మల్లికార్జున అన్నారు. ఆయన శుక్రవారం తాడ్వాయి మండలంలోని కృష్ణజివాడి హై స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన క్లాస్ రూమ్స్ లోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. పాఠ్యాంశంలోని పలు ప్రశ్నలను విద్యార్థులను అడిగి వారి అభ్యాసక సామర్థ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు.

అనంతరం అయన ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి విద్యార్థులలో అభ్యాసన సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించాలని తద్వారా విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన బోధించవచ్చన్నారు. పదో తరగతి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారికి పాఠ్యాంశాలు బోధించాలని వారు మెరుగైన విద్యా బోధించడం కోసం ఉపాధ్యాయులకు అయన పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రామస్వామి, ప్రధానోపాధ్యాయులు సంగుబాయి, ఉపాధ్యాయులు ధర్మబోయి, శ్వేత,సుజాత శ్రీహరి, బాబురావు, సంధ్యారాణి,సరిత,రాజిరెడ్డి, పాల్గొన్నారు.


