- అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలి…
- ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
ప్రస్తుత వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల ప్రవర్తనంగా ఉండాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ వర్షాకాలంలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశమై మండలంలోని అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా ఆరోగ్య శాఖ అధికారులు వైరల్ జ్వరాలు, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

అదేవిధంగా ప్రజలకు అవసరమైన సేవలను ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించేందుకు ప్రతి శాఖ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి చేరేలా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
